Begin typing your search above and press return to search.

ఇండియా వార్నింగ్.. తోకముడిచిన పాక్..! ఆలయ పునరుద్ధరణకు ఏర్పాట్లు..!

By:  Tupaki Desk   |   2 Jan 2021 4:30 PM GMT
ఇండియా వార్నింగ్.. తోకముడిచిన పాక్..! ఆలయ పునరుద్ధరణకు ఏర్పాట్లు..!
X
ఇటీవల పాకిస్థాన్లోని ఓ ఆలయాన్ని అక్కడి అతివాద ముస్లింలు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. దీంతో భారత్లో పెద్ద ఎత్తున నిరసనలు వచ్చాయి. అయితే ఇండియాలో వచ్చిన నిరసనలతో పాకిస్థాన్ అలర్టయ్యింది. 24 గంటల్లోనే ఆ ఆలయాన్ని, హిందువుల పవిత్ర స్థలాలను ధ్వంసం చేసిన నిందితులను అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. ధ్వంసమైన ఆలయాలను వెంటనే పునరుద్ధరిస్తామని కూడా ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇంతకాలంగా పాకిస్థాన్ భారత్ ను లౌకికవాద దేశం కాదంటూ అంతర్జాతీయంగా విమర్శలు గుప్పిస్తుంది. ఇండియాలో జరిగిన బాబ్రీ మసీదు విధ్వంసాన్ని సాకుగా చూపుతూ ప్రపంచదేశాలకు ప్రచారం చేస్తూ ఉంటుంది.

అయితే తాజాగా పాకిస్థాన్లో ఆలయ ధ్వంసం జరగడంతో ఆ దేశంపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో తమది లౌకికవాద దేశమేనని నిరూపించుకొనేందుకు పాకిస్థాన్ ఆలయ పునరుద్ధరణకు ఉపక్రమించిందని మరికొందరు భావిస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఇటీవల పాకిస్తాన్‌ ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని కరక్ జిల్లాలో తెరి గ్రామంలో కృష్ణ ద్వార మందిరం, పరమహంస జీ మహారాజ్ సమాధిని ఆలయాలను పున‌రుద్ధ‌రించేందుకు కొన్ని హిందూ ధార్మికసంఘాలు కోర్టులో అనుమతి కోరాయి. అయితే అందుకు కోర్టులు, అధికారులు ఇటీవల అనుమతి ఇచ్చాయి. అయితే ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ముస్లిం అతివాదులు రెచ్చిపోయారు. స్థానిక ఇస్లామిక్ మ‌త పెద్దతోపాటు జ‌మాతే ఉలేమా ఇస్లామ్ పార్టీ కార్య‌క‌ర్త‌లు వందల సంఖ్యలో పోగై ఆలయానికి నిప్పుపెట్టి, నిర్మాణాలను కూల్చేశారు.

ఈ ఘటనను వ్యతిరేకిస్తూ ఇండియాలోనూ నిరసనలు సాగాయి. అయితే ఈ రోజు ఖైబర్ పఖ్తుంఖ్వా ముఖ్యమంత్రి మహమూద్ ఖాన్ ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఈ ముకదాడిలో ధ్వంసమైన సమాధిని, ఆలయాన్ని ప్రభుత్వమే నిర్మిస్తుందని అధికారులు చెప్పారు. నిజానికి పాకిస్థాన్లో ఆలయాల విధ్వంసాలు యథేచ్చగా సాగుతుంటాయి. అక్కడి అతివాదులు హిందువుల దేవాలయాలను టార్గెట్ చేస్తున్నారు.