Begin typing your search above and press return to search.
భారత సంచలనం.. ఈ దేశాల వారికి నో ఎంట్రీ
By: Tupaki Desk | 17 March 2020 5:53 AM GMTకరోనా తో కల్లోలితంగా ఉన్న యూరప్ దేశాలు, బ్రిటన్, టర్కీల నుంచి భారత దేశంలోకి ప్రయాణికులు రాకుండా మోడీ సర్కారు నిషేధం విధించింది. మార్చి 18 నుంచి యూరప్ దేశాల నుంచి ప్రయాణికుల రాకను నిషేధించింది. అయితే ఇది ఎంతకాలమనేది పేర్కొనలేదు. నిషేధం తుదిగడువును మాత్రం కేంద్రం ప్రకటించలేదు. కరోనా తగ్గేవరకు ఆయా దేశాల వారు భారత్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి వీల్లేకుండా నిషేధం విధించిందన్నమాట..
ప్రస్తుతం యూరప్ లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఈ కారణంగా అక్కడ మరణాల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్ ఇతర దేశాల్లో కరోనా మరణ మృందంగం వాయిస్తోంది.
ఇక విదేశీయులతోనే భారత్ లో కరోనా వ్యాపిస్తుండడం తో ఈ వ్యాధిని కట్టడి చేసేందుకు భారత ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బ్రిటన్, ఈయూ, టర్కీ దేశాల నుంచి వచ్చే యాత్రికులను అనుమతించరాదని నిర్ణయించింది.
భారత్ లో ఇప్పటివరకు 100కు పైగా కేసులు నమోదయ్యాయి. ఇద్దరు వృద్ధులు మరణించారు. కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా 6వేల మందికిపైగా మరణించారు. లక్షన్నర మందికిపైగా కరోనా తో చికిత్స పొందుతున్నారు. భారత్ లో విజృంభించకూడదనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.