Begin typing your search above and press return to search.

కరోనా-చైనాను తేల్చేయడమే.. డబ్ల్యూ.హెచ్.ఓ కీలకభేటి

By:  Tupaki Desk   |   17 May 2020 2:30 PM GMT
కరోనా-చైనాను తేల్చేయడమే.. డబ్ల్యూ.హెచ్.ఓ కీలకభేటి
X
ప్రపంచవ్యాప్తంగా లక్షల మరణాలకు కారణమైన కరోనా వైరస్ ను పుట్టించిన చైనాను ఏకాకిని చేసేందుకు అగ్రదేశాలు ఏకమయ్యాయి. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్ తదితర దేశాలు కరోనా వైరస్ పుట్టుకపై విచారణకు డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఇప్పటిదాకా చైనా దేశాన్ని డబ్ల్యూ.హెచ్.ఓ వెనకేసుకొచ్చింది.

తాజాగా ప్రస్తుత డబ్ల్యూ.హెచ్.ఓ ఎగ్జిక్యూటీవ్ బోర్డు చైర్మన్ గా జపాన్ పదవీకాలం ముగియనుంది. దక్షిణాసియా నుంచి భారత్ కు ఈ అవకాశం తాజాగా దక్కింది. దక్షిణాసియా కోటాలో భారత్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ప్రస్తుతం అమెరికా - చైనాలో మధ్య కరోనా ఫైట్ సాగుతోంది. డబ్ల్యూహెచ్.ఓ చైనాకు మద్దతు తెలుపుతోంది. ఇప్పుడు బోర్డు చైర్మన్ గా భారత్ ఎన్నికైతే ఎలా వ్యవహరిస్తుందనేది ఆసక్తిగా మారింది. చైనాకు వ్యతిరేకంగా అమెరికాకు సపోర్టు చేసే అవకాశాలున్నాయని అంటున్నారు.

త్వరలోనే భారత్ చైర్మన్ గా డబ్ల్యూ.హెచ్.ఓ ఎగ్జి క్యూటీవ్ బోర్డు సమావేశం నిర్వహించబోతోంది. ఈ సమావేశంలో 194 సభ్యదేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొననున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి విషయంలో చైనా స్పందించాలని అమెరికా సహా మిత్ర దేశాలు డిమాండ్ చేస్తున్నాయి. విచారణ చేయాలని కోరుతున్నాయి.

ఇటీవలే భారత్ దీనిపై తొలిసారి స్పందించింది. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. కరోనా వైరస్ సహజసిద్ధమైంది కాదని.. ల్యాబ్ లోనే పుట్టిందని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో భారత్ వాదన అధికారికంగా ఇదేనని సమాచారం. దీంతో చైనాను బుక్ చేయడం ఖాయమని తెలుస్తోంది.