Begin typing your search above and press return to search.
పాక్ నటుల నిషేధంపై ముకేశ్ అంబానీ...
By: Tupaki Desk | 18 Oct 2016 8:24 AM GMTఉరీ ఉగ్రదాడి అనంతరం భారత్ - పాక్ ల మధ్య నెలకొన్న పరిస్థితుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. ఈ విషయంలో పాక్ కు తమ ఆగ్రహాన్ని చూపించే క్రమంలో బాలీవుడ్ లో ఉన్న పాకిస్థాన్ నటులపై నిషేధం విధించాలని, వారు దేశం విడిచి వెళ్లిపోవాలని మహారాష్ట్ర నవనిర్మాణ సేన హెచ్చరించడం. ఇదే సమయంలో పాక్ నటులపై నిర్మాతల మండలి నిషేధం విధించడం తెలిసిందే. ఈ విషయంపై బాలీవుడ్ రెండుగా చీలిపోయిందనే కథనాలు కూడా వచ్చాయి. అయితే ఈ విషయంపై తాజాగా స్పందించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేశ్ అంబానీ తన అభిప్రాయాన్ని కుండబద్దలుగొట్టినట్లు చెప్పారు.
భారతదేశంలో పని చేస్తున్న పాకిస్థాన్ కళాకారులపై నిషేధం విధించాలన్న డిమాండ్ పై స్పందించిన ముకేశ్ అంబానీ... తనకు కళలు - సంస్కృతి కన్నా భారతదేశమే ముఖ్యమైనదని స్పష్టం చేశారు. తనకు ఎల్లప్పుడూ దేశమే మొదటి స్థానంలో ఉంటుందని.. దేశానికే తాను ప్రాధాన్యం ఇస్తానని.. తాను మేధావిని కాదు కాబట్టి ఇవేవీ పూర్తిగా అర్థం కావు కానీ, అందరు భారతీయుల లాగానే తానకు కూడా భారతదేశమే మొదటి స్థానంలో ఉంటుందని.. ఈ ఒక విషయం గురించి చాలా స్పష్టంగా ఉన్నానని చెప్పారు.
ప్రముఖ పాత్రికేయులు శేఖర్ గుప్తా - బర్ఖా దత్ ఆధ్వర్యంలో "ది ప్రింట్" నిర్వహించిన "ఆఫ్ ది కఫ్" అనే కార్యక్రమంలో ముఖేశ్ అంబానీ పై విదంగా మాట్లాడారు. పాకిస్థానీ కళాకారులపై నిషేధం విధించడం గురించి స్పందించాలని ప్రేక్షకులు కోరినపుడు ముఖేశ్ తన అభిప్రాయాన్ని ఇలా వెల్లడించారు. ఇదే క్రమంలో రాజకీయాల్లో చేరుతారా? అనే ప్రశ్నకు అంబానీ సమాధానమిస్తూ... "నేను వాటికి తగను" అని సమాధానం ఇచ్చారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/