Begin typing your search above and press return to search.
ట్రంప్ తెలివితేటల్ని భారత్ వాడాలి
By: Tupaki Desk | 12 Jun 2018 12:46 PM GMTఅమెరికాను అణుబాంబులతో పేల్చివేస్తానన్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ మనసు మార్చి చర్చలకు రప్పించిన ట్రంప్ తెలివితేటలను ఇప్పుడు ప్రపంచం మొత్తం పొగుడుతోంది. సింగపూర్ లో ఈరోజు ట్రంప్-కిమ్ భేటి సహృద్భావ వాతావరణంలో సాగింది. ట్రంప్ ఉపయోగించిన ఈ మంత్రాన్ని ఇప్పుడు భారత్ కూడా అవలంభించాలని బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి సూచించారు. ఓ శత్రువును లొంగదీసుకునేందుకు ట్రంప్ వేసిన ఎత్తుగడలు సత్ఫలితాలను ఇచ్చాయని గుర్తు చేశారు. పాకిస్తాన్ ను కూడా ఇలానే భారత్ ఒప్పించగలిగేలా చొరవ తీసుకోవాలని స్వామి అభిప్రాయపడ్డారు.
సుబ్రహ్మణ్య స్వామి చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఆ ట్వీట్ లో ఆయన వ్యాఖ్యానిస్తూ.. ‘తొలుత పాకిస్తాన్ కు భయం అంటే ఏమిటో తెలిసేలా చేసి.. ఆ దేశాన్ని నాలుగు ముక్కలు చేయగల సత్తా భారత్ కు ఉందని తెలియజెప్పాలని స్వామి అన్నారు. ఇక రెండో దశలో పాకిస్తాన్ కు చైనా మద్దతు తెలుపకుండా ఉండేలా భారత్ చర్యలు తీసుకోవాలని సూచించారు.
ట్రంప్ లాగా వ్యవహరిస్తే పెంపుడు పిల్లిలా పాకిస్తాన్ తోకాడిస్తూ భారత్ ముందు కూర్చుంటుందని ట్విట్టర్ లో సుబ్రహ్మణ్య స్వామి సెటైర్ వేశారు. స్వామి చేసిన ఈ ట్వీట్ కు నెటిజన్లు భారీగా స్పందిస్తున్నారు. స్వామి చేసిన సూచనలను భారత్ పాటించాలని ట్వీట్ చేస్తున్నారు.