Begin typing your search above and press return to search.

కాశ్మీర్ పాక్‌ దే..భార‌త్ క‌బ్జా చేసింది!

By:  Tupaki Desk   |   26 Feb 2017 8:17 AM GMT
కాశ్మీర్ పాక్‌ దే..భార‌త్ క‌బ్జా చేసింది!
X
పొరుగు దేశం పాకిస్తాన్ పాల‌కులు ఎలా ఉంటారో చెప్పేందుకు ఇది తాజా ఉదాహ‌ర‌ణ. దాయాది పాకిస్తాన్ అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్ మరోసారి భారత్‌ పై నోరు పారేసుకున్నారు. భారత్ అక్రమంగా కాశ్మీర్‌ ను ఆక్రమించిందని నిందారోపణలకు దిగారు. అంతటితో ఆగకుండా భారత్ తన ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వెంటనే కాశ్మీర్‌ ను ఖాళీ చేయాలని డిమాండ్ చేశారు. దీర్ఘకాలికంగా కొనసాగుతున్న కాశ్మీర్ వివాదం పరిష్కారంలో ఇంకెంత మాత్రం జాప్యం జరిగినా, అది ప్రాంతీయ శాంతికి విఘాతం కలిగిస్తుందని ఆయన హెచ్చరించారు.

పాక్ జాతిపిత‌గా కొలిచే మొహమ్మద్ అలీ జిన్నా జయంతిని పురస్కరించుకొని పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పిఒకె) రాజధాని ముజఫరాబాద్‌ లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాకిస్తాన్ అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్ మాట్లాడుతూ భారత్‌ ను హెచ్చరించారు. కాశ్మీర్ ప్రజల మనోభావాలను భారత్ గౌరవించాలని ఆయన అన్నట్టు పాకిస్తాన్‌ కు చెందిన‌ ‘డాన్’ దినపత్రిక పేర్కొంది. కాశ్మీర్‌ ను ఆక్రమించిన భారత సైనిక బలగాలు కాశ్మీర్ ప్రజలను అణచివేయడానికి ప్రతి క్రూరమైన వ్యూహాన్ని అనుసరిస్తున్నాయని హుస్సేన్ ఆరోపించారు. ఇందులో భాగంగా వన్య మృగాలను వేటాడేందుకు ఉపయోగించే పెల్లెట్ గన్‌ లను అమాయకులయిన, నిరాయుధులయిన కాశ్మీర్ ప్రజలపై విచక్షణారహితంగా ఉపయోగిస్తున్నారని పేర్కొన్నారు. కాశ్మీర్ ప్రజలు తమ స్వయం నిర్ణయాధికార హక్కును వినియోగించుకునేందుకు సహకరించాలని ఆయన అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/