Begin typing your search above and press return to search.
చైనా బుద్ది మారలేదు.. ఏం చేస్తోందంటే!
By: Tupaki Desk | 3 Sep 2017 11:58 AM GMTనిన్న మొన్నటి దాకా డోక్లాంపై తీవ్ర రగడ సృష్టించి ప్రపంచ దేశాలతో మొట్టికాయలు వేయించుకున్న చైనా.. ఇప్పటికీ తన బుద్దిని మార్చుకోలేదు. ఏదో ఒక రూపంలో భారత్ ని కవ్వించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. డోక్లాం గొడవ సర్దు మణిగింది కదా..అనుకునేంతలో ఇప్పుడు మరోసారి చైనా వ్యవహారం తెరమీదకి వచ్చింది. భారత్ చైనా సరిహద్దుల్లోని భూభాగంలో రహదారులు వేసేందుకు డ్రాగన్ దేశం ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. భారత్ తో సరిహద్దు ఉన్న టిబెట్ - జిన్ జియాంగ్ ప్రాంతాల్లో మరిన్ని చోట్ల కొత్తగా రహదారులు వేసేందుకు చైనా సిద్ధమవుతోందని సమాచారం.
నిజానికి సరిహద్దుల్లో ఎలాంటి నిర్మాణాలు చేయరాదని అంతర్జాతీయ ఒప్పందాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే, దీనిని చైనా తిప్పికొడుతోంది. సరిహద్దుల్లో అదికూడా మా భూభాగంలో రహదారులు నిర్మించుకోవడం మా హక్కు.. దానిని కాదనే అధికారం ఎవరికీ లేదు.. అని వితండ వాదం చేస్తోంది. ఇదే విషయంపై మీడియాతో మాట్లాడిన చైనా రాజకీయ వ్యూహకర్త విక్టర్ గో మేం రహదారులు నిర్మించుకుంటే భారత్ ఎందుకు భయపడుతోందని అని ప్రశ్నించడం రగడను మరింత పెద్దది చేయడమే అంటున్నారు విశ్లేషకులు. అంతేకాదు, సమసి పోయిందని భావిస్తున్న డోక్లాం సహా.. సరిహద్దు ప్రాంతాల్లో హైవేల నిర్మాణం చేస్తామని ప్రకటించారు.
చైనా చేపడుతున్న రహదారులు - భవనాల నిర్మాణాన్ని భారత్ అడ్డుకోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం బ్రిక్స్ సదస్సు జరుగుతున్న దృష్ట్యా.. వివాదాల ప్రస్తావన లేకుండా చూసుకోవాలన్నది చైనా వ్యూహం. అందువల్లే 73 రోజుల డోక్లాం వివాదానికి బీజింగ్ ముగింపు పలికిందని విశ్లేషకుల మాట. అయితే బ్రిక్స్ సదస్సు అనంతరం సరిహద్దు ప్రాంత్లాల్లో రహదారుల నిర్మాణ క్రమాన్ని వేగంగా ముందుకు తీసుకువెళుతుందని చైనా మేధావులు చెబుతున్నారు. ఇప్పటికే దక్షిణ చైనా సముద్రంలోనూ చైనా అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తోందని చెబుతున్నారు. ఈ క్రమంలో తనను ఎవరూ అడిగేవారే లేరన్నట్టుగా చైనా వ్యవహరించడం గమనార్హం. ఏదేమైనా.. బ్రిక్స్ సమావేశాల అనంతరం పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.