Begin typing your search above and press return to search.
ఉలిక్కిపడేలా చేసిన యోగా గురువు వ్యాఖ్యలు
By: Tupaki Desk | 11 Jun 2017 6:01 AM GMTయోగా గురువు అంటే.. మ్యాట్ మీద కూర్చొని ముక్కు మూసుకొని.. కొన్ని ఆసనాలు వేసుకోవటంతో సరిపోదన్న విషయాల్ని చేతల్లో చేసి చూపించిన వ్యక్తి రాందేవ్ బాబా. పేరుకు యోగా గురువు అయినప్పటికీ.. తన వ్యాపారంతో కొమ్ములు తిరిగిన మల్టీనేషనల్ కంపెనీలకు సైతం చుక్కలు చూపిస్తూ వ్యాపారాన్ని అంతకంతకూ విస్తరిస్తున్నారు. కొత్తతరహా వ్యాపారాన్ని తెర మీదకు తెస్తున్నారు.
అధ్యాత్మిక రంగంలో ఉన్న వ్యక్తి వ్యాపారం చేయటం ఒక చిత్రమైతే.. రెండింటిని ఏక కాలంలో సూపర్ హిట్ చేయగలిగిన మొనగాడిగా రాందేవ్ బాబాను చెప్పక తప్పదు. ఓపక్క అధ్యాత్మిక రంగం.. మరోవైపు వ్యాపారంలో దూసుకెళుతున్న ఆయన.. అక్కడితో అగితే ఆయన ప్రత్యేకత ఏముంటుంది?
అందుకే కాబోలు.. ఇప్పుడు ఆయన నోటి నుంచి వస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి. ఓటమి చెందిన దేశం.. విజేత దేశానికి చెందిన భూభాగాన్ని ఆక్రమించి.. దశాబ్దాల తరబడి తన అధీనంలో ఉంచుకున్న ఉదంతం ఏదైనా ఉందంటే.. అది పాక్ ఆక్రమిత కాశ్మీర్ గానే చెప్పాలి. అక్కడి స్థానిక ప్రజలకు ఏ మాత్రం ఇష్టం లేకున్నా.. దుర్మార్గంగా తన అధీనంలో ఉంచుకున్న ప్రాంతాన్ని.. దేశంలోకి కలుపుకోవాలన్న మాటను ఒక్కటంటే ఒక్క రాజకీయ పార్టీ నోటి నుంచి కూడా రాలేదని చెప్పాలి. ఈ మధ్యన బీజేపీ నేతలు పాక్ ఆక్రమిత కాశ్మీర్.. భారతదేశానిదేనన్న మాటనైనా చెబుతున్నారు. ఇంతకు ముందు వరకూ ఆ మాట చెప్పేందుకు సైతం ధైర్యం చాలని పరిస్థితి.
ఇలాంటి వేళ.. యోగా గురువు రాందేవ్ బాబా మాత్రం తనదైన శైలిలో దూసుకెళ్తున్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను భారత్ వెంటనే తిరిగి స్వాధీనంలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పాక్ నుంచి తలెత్తుతున్న అన్ని సమస్యలకు కారణం పాక్ ఆక్రమిత కాశ్మీరేనన్న ఆయన.. పీవోకేను భారత్ లోకి కలిపేసుకోవాలని డిమాండ్ చేశారు. భారత పాక్ సరిహద్దుల్లో రక్తపాతం సృష్టించిన ఉగ్రవాదులు అజహర్ మసూద్..హఫీజ్ సయిద్.. దావూద్ ఇబ్రహీంలను సజీంగా కానీ వారి మృతదేహాల్ని కానీ భారత్ కు అప్పగించాలని పాక్‌కు డిమాండ్ చేశారు. యోగా గురువు డిమాండ్స్ విన్నప్పుడు.. ఈ తరహాలో రాజకీయ పార్టీలు ఏ రోజు పాక్‌ను డిమాండ్ చేస్తాయి? అన్న సందేహం రాక మానదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/