Begin typing your search above and press return to search.
హిందూ మహాసముద్రంపై డ్రాగన్ పాగా!
By: Tupaki Desk | 20 Nov 2016 6:55 AM GMTపొరుగుదేశం అయినప్పటికీ భారత్ ను ఇరకాటంలో పెట్టడంలో ముందుంటూ వెన్నుపోటు రాజకీయాలకు పాల్పడుతున్న చైనా ఈ క్రమంలో మరో అడుగు వేసింది ఈ క్రమంలో హిందూ మహా సముద్రంపై తన పట్టు పెంచుకునే దిశగా చైనా వేగంగా అడుగులు వేస్తోంది. భారత దేశం చుట్టూ ఉన్న దేశాలతో వాణిజ్య సంబంధాలు పెంచుకుంటూ - భారత్ ను ఏకాకిని చేసే ఎత్తుగడ వేస్తున్నది. ప్రధానంగా హిందూ మహాసముద్రంపై దృష్టిసారించడంలో భాగంగా ఈనెల 14న పాకిస్థాన్ - బంగ్లాదేశ్ లలో పెద్ద ప్రాజెక్టులకు రూపకల్పన చేయడమే ఇందుకు నిదర్శనమని పలువురు పేర్కొంటున్నారు.అయితే తీరప్రాంత దేశాల్లో భారీగా పెట్టుబడులు పెడుతూ - ప్రాజెక్టులు మంజూరు చేస్తున్నది. ఆర్థికంగా - రాజకీయంగా చైనాకు పోటీ ఇవ్వలేక భారత్ వెనుకబడుతున్నది.
పాకిస్థాన్ లో చైనా చేపడుతున్న భారీ ప్రాజెక్టు సీపీఈసీ. దక్షిణ ఆసియా - చైనా - మధ్య ఆసియాలను కలుపుతూ మార్గం నిర్మించాలన్నది చైనా వ్యూహం. అయితే తమ ప్రాజెక్టు వాణిజ్యపరమైనదని - భారీగా పెట్టుబడులు వస్తాయని, ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయని చైనా చెబుతున్నది. పాకిస్థాన్ తాను ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు సీపీఈసీ పరిష్కారం చూపుతుందని ఆశిస్తున్నది. అమెరికా - యూరప్ దేశాలు భారత్ వైపు మొగ్గు చూపుతూ తమను ఒంటరిని చేస్తున్న తరుణంలో చైనా తమకు అండగా నిలిచిందని, రాజకీయంగా, ఆర్థికంగా ఇది తమకు మేలు చేస్తుందని భావిస్తున్నది. మరోవైపు పాకిస్థాన్ లో చైనా నిర్మించిన గ్వాదర్ పోర్టు ఈ నెల 14న ప్రారంభమైంది. చైనా-పాకిస్థాన్ ఎకనామికల్ కారిడార్ లో భాగంగా ఈ పోర్టును నిర్మించింది. చైనా నుంచి వచ్చిన ఓ భారీ ఓడ గ్వాదర్ పోర్ట్ లో వాణిజ్య కార్యకలాపాలకు శ్రీకారం చుట్టింది. దీంతో అరేబియా సముద్రంలో ఆధిపత్యం సాధించాలన్న చైనా కొరిక నెరవేరే అడుగు పడింది. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా డిసెంబర్ లో భారత్ లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో చైనా తన వ్యూహంలో భాగంగా బంగ్లాదేశ్ కు మొదటిసారి సబ్ మెరైన్ ను అందిస్తామని ఈనెల 14న ప్రకటించింది. వ్యాపార - వాణిజ్య సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నిస్తామని చెప్పింది. చైనా ఇప్పటికే బంగ్లాదేశ్ కు ప్రధాన ఆయుధ సరఫరాదారుగా ఉన్నది.
ఇరాన్ కు సమీపంలోని చాబహార్ పోర్టును భారత్-ఆఫ్ఘనిస్థాన్-ఇరాన్ మైత్రిలో భాగంగా అభివృద్ధి చేయడానికి భారత్ 2003లో ఒప్పందం చేసుకుంది. అయితే ఇరాన్ పై ఆంక్షల నేపథ్యంలో ఇప్పటికీ పనులు పూర్తి కాలేదు. దీనిని దెబ్బతీసేందుకు చైనా చాబహార్ పోర్టుకు కేవలం వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్వాదర్ పోర్టును నిర్మించింది. మయన్మార్ రాజకీయాల్లో చైనా ఎప్పటినుంచో తలదూరుస్తూనే ఉన్నది. సైనిక పాలన నడుస్తున్న ఆ దేశానికి సలహాలు - సూచనలు అందిస్తూ ప్రత్యక్ష - పరోక్ష సహాయం అందిస్తున్నది. మరోవైపు నేపాల్ లో పలు ప్రాజెక్టులు ప్రారంభించనున్నది. బీహార్ సరిహద్దు వరకు కలుపుతూ ఓ భారీ రైల్వే ప్రాజెక్టు నిర్మించనున్నది. ఇటీవల శ్రీలంక ప్రధాని విక్రమసింఘే చైనా రాయబారితో సమావేశమయ్యారు. శ్రీలంకలో మట్టాల అంతర్జాతీయ విమానాశ్రయం - హంబన్టోటా పోర్టు సహా భారీ ప్రాజెక్టులు చేపట్టాలని కోరారు. ఈ మేరకు చైనా సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ మేరకు నిబంధనలు సవరించేందుకు సైతం చైనా సర్కారు సిద్ధమైంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/