Begin typing your search above and press return to search.
కోహినూర్ మీద చేతులెత్తేసిన మోడీ సర్కార్
By: Tupaki Desk | 18 April 2016 9:42 AM GMTపట్టుదలతో సాధించాలన్న తపన ఉండాలే కానీ ఏదీ అసాధ్యం కాదు. అలా అని అన్ని సాధ్యం కూడా కాదు. కొన్ని అసాధ్యమైన అంశాల విషయాల్లో ఎంతోకొంత ప్రయత్నం చేస్తే ఫలితం వచ్చే అవకాశం లేకపోలేదు. కానీ.. అలాంటివేమీ తమకు లేవన్న విషయాన్ని మోడీ సర్కారు తేల్చి చెప్పేసింది. బ్రిటీషోడు భారతదేశాన్ని బానిసగా చేసుకొని పాలించిన రోజుల్లో ఎంతో సంపదను తన దేశానికి దోచుకుపోయిన సంగతి చరిత్ర తెలిసిన ప్రతిఒక్కరికి తెలిసిందే.
నాగరిక సమాజంలో దోచుకున్నదంతా తిరిగి ఇవ్వలేమని చెప్పలేం కానీ.. దేశ ప్రజల మనోభావాలు.. భావోద్వేగాలతో ముడిపడిన అంశాలపై పోరాటం చేయటం ద్వారానో.. ప్రయత్నించటం ద్వారానో సాధించుకునే మార్గం ఉంది. దేశానికే తలమానికమైన కోహినూర్ వజ్రాన్ని తిరిగి దేశానికి తెచ్చుకోవాలన్న కల ప్రతి భారతీయుడికి ఉంది. మన నుంచి తీసుకెళ్లిన కోహినూర్ ను తిరిగి తెచ్చేందుకు ప్రభుత్వం ఏదైనా ప్రయత్నం చేయాలంటూ ఒక వ్యక్తి సుప్రీం కోర్టుకు ఎక్కిన సంగతి తెలిసిందే.
ఈ కేసు విచారణ తాజాగా సుప్రీం కోర్టులో సాగింది. ఈ సందర్భంగా కేంద్ర సర్కారు తరఫున హాజరైన ప్రభుత్వ న్యాయవాది.. కోహినూర్ వజ్రాన్ని తిరిగి తేవటం సాధ్యం కాదని తేల్చి చెప్పేసింది. కోహినూర్ వజ్రాన్ని నాటి రాజులు ఈస్టిండియా కంపెనీకి కానుకగా ఇచ్చారని పేర్కొంది. కోహినూర్ చోరీ జరగలేదు కాబట్టి తిరిగి తీసుకురాలేమని సుప్రీంకు చెప్పింది. విదేశీ పర్యటనల సందర్భంగా ఆయా దేశాలకు చెందిన అపురూప వస్తువుల్ని అక్కడి వారికి బహుమానంగా ఇవ్వటం మామూలే.
అలానే.. కోహినూర్ వజ్రాన్ని భారత్ కు బహుమానంగా బ్రిటన్ ఇచ్చేలా దౌత్యప్రయత్నాలు ఎందుకు షురూ చేయకూడదు? బహుమానంగా తరలి వెళ్లిందని చెబుతున్న దాన్ని.. అదే రీతిలో తిరిగి తెచ్చుకునే అవకాశం ఉండదా? మనసులో ప్రయత్నించాలని ఉంటే సాధ్యాసాధ్యాలన్నవి ఉండవు. కానీ.. సుప్రీంకోర్టులో కేంద్రం తాజాగా చెప్పిన మాటలు చూస్తుంటేనే.. మోడీ సర్కారు మనసేమిటన్నది అర్థమవుతుంది. ఇలాంటప్పుడు కోహినూర్ తిరిగి రావటం సాధ్యం కానట్లే.