Begin typing your search above and press return to search.
అమెరికాలో సిగరెట్ కోసం భారతీయుడి హత్య
By: Tupaki Desk | 9 May 2017 7:03 AM GMTజాతి విద్వేష దాడులు తారాస్థాయికి చేరిన అమెరికాలో మరో దారుణం చోటుచేసుకుంది. తాజాగా మరో భారతీయుడు అగ్రరాజ్యంలో హత్యకు గురయ్యాడు. సిగరెట్ ఇవ్వని కారణంగా జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తూ కత్తితో పొడిచి చంపాడు. అలా విగత జీవిగా మారిన వ్యక్తి పంజాబ్‌లోని కపుర్తలాకు చెందిన 32 రెండేళ్ల జగ్ జీత్ సింగ్.
ఉపాధి కోసం 18 నెలల క్రితం అమెరికా వచ్చిన జగ్ జీత్ సింగ్ వాషింగ్టన్లోని హట్చ్ ఫుడ్, గ్యాస్ కన్వీనియెన్స్ స్టోర్‌లో క్లర్క్‌గా పనిచేస్తున్నాడు. సింగ్ డ్యూటీలో ఉన్న సమయంలో దుకాణంలోకి ఓ వ్యక్తి వచ్చి తనకు సిగరెట్లు కావాలని అడిగారు. అయితే సదరు వ్యక్తి మైనర్ అని భావించిన జగ్ జీత్ సింగ్ ఐడీ కార్డు చూపించాలని కోరాడు. దీంతో సదరు వ్యక్తి అసహనంగా వెళ్లిపోయాడు. అయితే తన డ్యూటీ పూర్తి చేసుకొని బయటకు వెళ్లే సమయంలోనే మృత్యువు పొంచి ఉందనే విషయం జగ్ జీత్ సింగ్‌కు తెలియలేదు.
డ్యూటీ ముగించుకొని స్టోర్ బయటకు వచ్చిన సమయంలో సదరు సిగరెట్ అడిగిన వ్యక్తి జగ్ జీత్ సింగ్ వద్దకు వచ్చి తీవ్ర పదజాలంతో జాత్యహంకారంతో దూషిస్తూ సింగ్‌ను కత్తితో పొడిశాడు. సింగ్ పెద్ద ఎత్తున హాహాకారాలు చేస్తుండటాన్ని గమనించిన స్థానికులు ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే దుండగుడి కత్తిపోట్లు బలంగా తాకడంతో 9 గంటలపాటు చికిత్స పొందిన అనంతరం జగ్ జీత్ సింగ్ ఆస్పత్రిలోనే ప్రాణాలు కోల్పోయాడు, వరుసగా జరుగుతున్న దుర్ఘటనలకు తాజా ఉదంతం తోడవడంతో అమెరికాలోని ఇండియన్లు భయకంపితులు అవుతున్నారు.