Begin typing your search above and press return to search.

మోడీని బహిష్కరించమన్న చిదంబరం

By:  Tupaki Desk   |   23 Oct 2015 8:06 AM GMT
మోడీని బహిష్కరించమన్న చిదంబరం
X
మోడీ ఏంటి.. బ్రిటన్ నుంచి ఆయన్ను బహిష్కరించడం ఏంటి..? అంతా కన్ఫ్యూజన్ గా ఉందా..? ఏం కన్ఫ్యూజన్ అవసరం లేదు. ఈ మోడీ ఆ మోడీ కాదు. ఈయన లలిత్ మోడీ.. మహా కిలాడీ.

దేశంలో సంచనలం సృష్టించిన లలిత్ గేట్ కుంభకోణంలో ప్రధాన నిందితుడు లలిత్ మోడీ ఆ కుంభకోణం గుట్టుమట్లు బయటకు వచ్చిన 2010 నుంచి లండన్ లోనే ఉంటున్న సంగతి తెలిసిందే. ఆయన్ను ఇండియాకు రప్పించడానికి గత యూపీయే ప్రభుత్వం ట్రై చేసిందట. లలిత్ మోడీని వెంటనే బ్రిటన్ నుంచి బహిష్కరించాలని నాటి ఆర్థిక మంత్రి పి.చిదంబరం బ్రిటన్ కు లేఖ కూడా రాశారు. సమాచారం హక్కు చట్టం ద్వారా ఓ వ్యక్తి దీనికి సంబంధించిన వివరాలు కోరడంతో ఇదంతా వెలుగు చూసిది.

భారీ కుంభకోణం అనంతరం 2010 నుంచి లలిత్ మోదీ బ్రిటన్ లోనే ఉంటున్నారు. ఆయనను వెనక్కి రప్పించేందుకు యూపీయే గవర్నమెంటు బాగానే ప్రయత్నించిందట. చిదంబరం బ్రిటన్ కు రాసిన లేఖే దానికి ఉదాహరణ. లలిత్ మోడీని భారత్ కు రప్పించే ప్రక్రియకు ఎక్కువ సమయం తీసుకునే అవకాశం ఉన్నందున వెంటనే ఆయన్ను బ్రిటన్ నుంచి బహిష్కరించాలని చిదంబరం విజ్ఞప్తి చేశారు. ఆయనపై ఉన్న తీవ్రమైన నేరాల కేసుల విచారణను భారత్ లోని కీలక విచారణ సంస్థలు పనిచేస్తున్నాయని.. ఆయన్ను ఇండియాకు అప్పగించాల్సిన అవసరం ఉందని కూడా చిదంబరం అందులో ప్రస్తావించారు. ఆయన పాస్ పోర్టును చట్ట వ్యతిరేకమైనదిగా తాము గుర్తించినందున ఎక్కువకాలంపాటు ట్రావెలింగ్ డాక్యుమెంట్స్ పనిచేసే అవకాశం ఉండదని, అయినా అతడు బ్రిటన్ లో ఉంటున్నాడని, వెంటనే అక్కడి నుంచి బహిష్కరించాలని విన్నవించారు.

కాగా చిదంబరం ఈ విషయంలో కొన్ని ఉదాహరణలు కూడా ఇచ్చారు. పాస్ పోర్టు పరమైన తప్పులు చేసిన 3000మంది ఇండియన్స్ ను బ్రిటన్ నుంచి గతంలో బహిష్కరించిన విషయం ఆయన గుర్తు చేశారు. దీనికి బ్రిటన్ స్పందించి తిరిగి బదులు సమాధానం కూడా ఇచ్చింది. తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. అయినా ఇంతవరకు బ్రిటన్ చేసిందేమీ లేదు.. లలిత్ మోడీ వచ్చిందీ లేదు. మొత్తానికి ఈ మోడీ బ్రిటీషోళ్లనూ మాయ చేసేసినట్లున్నాడు.