Begin typing your search above and press return to search.
ఒక్కరోజులో రూ.11.28లక్షల కోట్లు ఆవిరి
By: Tupaki Desk | 13 March 2020 5:00 AM GMTలక్ష కోట్లు అంకె వేయటానికి ప్రయత్నించండి. ఒకే దఫాలో ఈ భారీ అంకెను వేసే వారు అతి కొద్దిమంది మాత్రమే. అంకె వేయటానికే ఇన్ని అపసోపాలు పెట్టే పరిస్థితి ఉంటే.. ఇంత భారీ మొత్తం కళ్ల ముందు కరిగిపోతుంటే ఎలా ఉంటుంది. లక్ష కోట్ల రూపాయిలకే ఇలాంటి పరిస్థితి ఉంటే.. ఒకరోజులో.. అది కూడా కొన్ని గంటల వ్యవధిలో ఏకంగా రూ.11.28 లక్షల కోట్ల మదుపరుల మొత్తం ఆవిరైతే పరిస్థితి ఏమిటి?
కళ్ల ముందు కనిపించే ఈ భారీ ఊచకోతకు నిలువెల్లా వణికిపోయే పరిస్థితి. ప్రస్తుతం భారత స్టాక్ మార్కెట్ పరిస్థితి ఇదే రీతిలో ఉంది. కంటికి కనిపించని కరోనా వైరస్ కారణంగా ప్రపంచ మార్కెట్లు కిందామీదా పడుతుంటే.. భారత్ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. కరోనా కారణంగా చిగురుటాకులా వణుకుతున్న సెన్సెక్స్.. గురువారం భారీ కుదుపునకు లోనైంది. మార్కెట్లో బేర్ ఊచకోతతో.. మదుపరుల సొమ్ము రికార్డు స్థాయిలో రూ.11.28 లక్షల కోట్లు ఆవిరైపోయాయి.
ఈ మహా పతనాన్ని కలలో కూడా ఊహించని మదుపురులు.. స్టాక్ ఎక్సైంజ్ లో ట్రేడింగ్ ఎప్పుడు ఆగిపోతుందిరా భగవంతుడా? అని దణ్ణం పెట్టుకున్న దుస్థితి. దారుణమైన రీతిలో బేర్ రంకెలు వేస్తున్న వేళ.. గురువారం ఒక్కరోజులోనే సెన్సెక్స్ 2919 పాయింట్లు.. నిఫ్టీ 868 పాయింట్లు నష్టపోయాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. గురువారం చోటు చేసుకునే రక్తపాతానికి సంకేతాలుగా..ట్రేడింగ్ స్టార్ట్ అయిన కొద్ది గంటల్లోనే సెన్సెక్స్ 1800 పాయింట్లు నష్టపోయింది.
ఈ భారీ కుదుపు కారణంగా దేశంలోని దాదాపు 800 కంపెనీల షేర్లు ఏడాది క్రితం ఏ ధరకు ఉన్నాయో.. ఆ ధరకు పడిపోయాయి. ఇలాంటి పరిస్థితి ఒక్క భారత్ కు మాత్రమే పరిమితం కాలేదు. అమెరికా మార్కెట్ పరిస్థితి ఇంతే. ట్రేడింగ్ ప్రారంభంలోనే డౌజోన్స్ దాదాపు 10 శాతం క్రాష్ అయింది. మొత్తంగా 2200 పైగా పాయింట్లు కోల్పోయింది. యూరప్ సూచీలు సైతం పది శాతానికి పైగా పడిపోయాయి.
మార్కెట్ సెంటిమెంట్ ను ఇంత దారుణంగా ఎలా ప్రభావితమైందన్న విషయానికి వస్తే.. కరోనా కారణంగా వివిధ దేశాల్లో ప్రయాణాలు 30 రోజుల పాటు నిలిపివేస్తున్న అమెరికా ప్రకటించింది. యూరప్ నుంచి (ఒక్క బ్రిటన్ మినహాయించి) అన్ని దేశాల నుంచి అమెరికాకు ప్రయాణం నెల పాటు ఆగిపోవటం..పెద్దన్న బాటలోనే పలు దేశాలు పయనించటంతో మార్కెట్లో తీవ్ర భయాందోళనలు మొదలయ్యాయి. కరోనా కారణంగా వివిధ పరిశ్రమల్లో ఉత్పత్తిని ఆపివేసే ప్రమాదం ఉందన్న భయాలు సైతం మార్కెట్ తిరోగమనానికి కారణంగా చెబుతున్నారు. ఏమైనా.. గురువారం మార్కెట్లో భారీ రక్తపాతం చోటు చేసుకుందని చెప్పక తప్పదు.