Begin typing your search above and press return to search.
ఇజ్రాయెల్ కు భారత్ అండ..
By: Tupaki Desk | 2 Jan 2023 7:16 AM GMTగత కొన్ని నెలలుగా ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య దాడులు మళ్లీ ప్రారంభమయ్యాయి. ఈ పంచాయితీ ఐక్యరాజ్య సమితి వరకు వెళ్లింది. అయితే ఐక్యరాజ్యసమితిలో ఈ దాడులపై భారత్ స్పందన ఏ విధంగా ఉంటుందనేది చర్చనీయాంశంగా మారింది. భారత ప్రధానిగా నరేంద్ర మోదీ అయిన తరువాత ఇజ్రాయెల్ తో సంబంధాలు మెరుగయ్యాయి. బీజేపీ సైద్ధాంతికంగా కూడా ఇజ్రాయెల్ ను సమర్థిస్తోంది. ఇజ్రాయెల్ అరబ్ దేశాలపై దాడులు చేసి.. ఆ ప్రాంతాలను ఆక్రమించుకున్నందున ఆ దేశ చర్యలు బీజేపీ సమర్థిస్తోంది. అయితే ప్రభుత్వం పరంగా నరేంద్ర మోదీ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటాడనేది ఆసక్తి గా మారింది. మే 12న ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి చర్చల సమయంలో భారత్ తరుపున తిరుమూర్తి మాట్లాడారు. ఇజ్రాయెల్ దాడిని ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. అసలు ఇజ్రాయెల్ పై భారత్ వైఖరి ఏ విధంగా ఉంది..?
2016లోని 2334 తీర్మానం ప్రకారం 1967 తరువాత స్వాధీనం చేసుకున్న పాలస్తీనా భూభాగాల్లో ఇజ్రాయెల్ కాలనీలు ఏర్పాటు చేయడానికి చట్టబద్ధత లేదు. ఈ విషయంలో పాలస్తీనాకు భారత్ మద్దతు పలికింది. కానీ 2017లో నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ పర్యటన చేశారు. ఆ సందర్భంగా మోదీ ఇజ్రాయెల్ లో పర్యటించడం ఒక అద్భుతం అని ఆ దేశ ప్రధాని బెంజమిన్ అన్నారు. ఆ తరువాత నెతన్యాహు 2018లో భారత్ కు వచ్చారు. ఆ సమయంలో సైబర్ సెక్యూరిటీ, చమురు, గ్యాస్ సహకారంపై ఒప్పంద సంతకాలు చేశారు.
వాస్తవానికి భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం పాలస్తీనా అంశానికి మద్దతు ఇచ్చారు. 1974లో పాలస్తీనా విముక్తి సంస్థను గుర్తించిన ఏకైక అరబేతర దేశం భారత్ మాత్రమే . 1996లో భారత్ గాజాలో కార్యాలయాన్ని కూడా ప్రారంభించింది. ఆ తరువాత 2003లో దానిని రమల్లాకు మార్చారు. ఎన్నో బహుపాక్షిక వేదికలపై భారత్ పాలస్తీకు మద్దతు ఇస్తూ వస్తోంది. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 53వ సమావేశంలోనూ పాలస్తీనా ప్రజల స్వయం నిర్ణయాధికారంపై ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మానాన్ని భారత్ సమర్థించింది. ఈ సమయంలో విభజన గోడ కట్టాలన్న ఇజ్రాయెల్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 2003లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ చేసిన తీర్మానంపై భారత్ సంతకం చేసింది.
అయితే మోదీ పైకి పాలస్తీనాకు మద్దతు ఇస్తూనే తెర వెనుక ఇజ్రాయెల్ కు అండగా ఉంటున్నట్లు కనిపిస్తున్నారు. మోదీ ఇజ్రాయెల్ వెళ్లారు. కానీ ఆ తరువాత పాలస్తీనా భూభాగంపై పర్యటించారు. అయితే పీవీ నరసింహారావు నుంచి ఇప్పటి వరకు భారత ప్రభుత్వం రెండు దేశాలతో సహకారంగా ఉంటోంది. కానీ మోదీ ప్రభుత్వం మాత్రం ఇజ్రాయెల్ కు దౌత్యపరంగా బహిరంగంగా మద్దతు ఇస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పుడు పాలస్తీనాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులపై మౌనంగా ఉండిపోయారు. మోదీ మౌనానికి కారణాలు అనేకం ఉన్నాయి.
ఇజ్రాయెల్ నుంచి భారత్ రక్షణ టెక్నాలజీని దిగుమతి చేసుకుంటోంది. దానితో పాటు రెండు దేశాల మధ్య కూడా సమాచారం ఇచ్చిపుచ్చుకుంటున్నారు. భద్రతా అంశాల్లో రెండు దేశాలు కలిసి పనిచేస్తున్నాయి.2014లో భారత్, ఇజ్రాయెల్ కలిసి మూడు ముఖ్యమైన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. 2015 నుంచి భారత్ ఐపీఎస్ అధికారులు ఏటా ఇజ్రాయెల్ జాతీయ పోలీస్ అకాడమీలో వారం పాటు ట్రైనింగ్ తీసుకుంటున్నారు. 2019 గణాంకాల ప్రకారం ఇజ్రాయెల్ లో దాదాపు 550 మంది విద్యార్థులు ఉన్నారు.ఈ నేపథ్యంలో భారత్ ఇజ్రాయెల్ కు మద్దతు ఇస్తున్నట్లు తెలుస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.