Begin typing your search above and press return to search.

రష్యాను దాటేసిన భారత్ ‌... నాలుగో అతిపెద్ద దేశంగా .. !

By:  Tupaki Desk   |   16 March 2021 12:30 AM GMT
రష్యాను దాటేసిన భారత్ ‌... నాలుగో అతిపెద్ద దేశంగా ..  !
X
విదేశీ మారక నిల్వల్లో రష్యాను అధిగమించి ప్రపంచంలో నాలుగో అతి పెద్ద విదేశీ మారక నిల్వల దేశంగా భారత్‌ నిలిచింది. దక్షిణాసియా దేశాల సెంట్రల్ బ్యాంక్ పెట్టుబడుల ఉపసంహరణ చర్యలకు వ్యతిరేకంగా ఆర్థిక వ్యవస్థను పరిరక్షించడానికి డాలర్లను నిల్వ చేయడంతో భారత్‌ విదేశీ మారక నిల్వలు గణనీయంగా పెరిగాయి.ఈ ఏడాది పెట్టుబడులు వేగంగా పెరిగిన తరువాత, ఇరు దేశాల మారక నిల్వలు దాదాపు సమానమయ్యాయి. ఇటీవలి వారాల్లో రష్యా కంపెనీల్లో పెట్టుబడులు వేగంగా తగ్గడంతో మారక నిల్వల్లో భారత్ ముందుకు వచ్చింది. దీనితో రష్యాను అధిగమించిన భారత్ 4 వ స్థానంలో నిలిచింది.

మార్చి 5 నాటికి భారతదేశ విదేశీ కరెన్సీ హోల్డింగ్స్ 4.3 బిలియన్ డాలర్లు తగ్గి 580.3 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుక్రవారం తెలిపింది. రష్యా 580.1 బిలియన్‌ డాలర్ల మారక నిల్వలు కలిగి ఉంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి ప్రకారం విదేశీ మారక నిల్వల్లో మొదటి స్థానంలో చైనా ఉండగా, తరువాతి స్థానాల్లో వరుసగా జపాన్ , స్విట్జర్లాండ్ ఉన్నాయి. ప్రస్తుతం భారత్‌ దగ్గర సుమారు 18 నెలల దిగుమతులను చేయడానికి సరిపోయే విదేశీ నిల్వలున్నాయి.

అరుదైన కరెంట్, అకౌంట్ మిగులు, స్థానిక స్టాక్ మార్కెట్‌ లోకి పెట్టుబడుల పెరుగుదల, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అధికంగా రావడంతో మారక నిల్వలు పెరిగాయి. సెంట్రల్ బ్యాంక్ డేటా ప్రకారం గత ఏడాది స్పాట్ ఫారెన్‌ ఎక్సేఛేంజ్‌ మార్కెట్లో ఆర్బిఐ 88 బిలియన్ డాలర్లను నికరంగా కొనుగోలు చేసింది. ఇది గత ఏడాది ఆసియాలోని ప్రధాన కరెన్సీలలో రూపాయి విలువ చెత్తగా ప్రదర్శించడానికి సహాయపడింది.