Begin typing your search above and press return to search.
భారత్ లోని విదేశీయుల వీసాలపై తాత్కాలిక రద్దు
By: Tupaki Desk | 6 May 2020 6:45 AM GMTభారత్ లోని విదేశీయులకు మంజూరు చేసిన వీసాలపై తాత్కాలిక రద్దు కొనసాగుతోంది. కరోనా వేళ విధించిన లాక్ డౌన్ వేళ.. కేంద్రం తాజా నిర్ణయాన్ని తీసుకుంది. భారత్ లో ఉన్న ఫారినర్ల వీసా గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. భారత పౌరసత్వం కలిగిన విదేశీయులు ఎన్ని రోజులైనా భారత్ లో ఉండొచ్చని పేర్కొంది. లాక్ డౌన్ నేపథ్యంలో ప్రయాణాలపై బ్యాన్ ఎత్తి వేసేంత వరకూ ఈ విధానం అమల్లో ఉండనుంది.
పలు మార్లు ప్రయాణించే సౌకర్యం ఉన్న దీర్ఘకాలిక వీసాలు.. భారత పౌరసత్వం కలిగిన విదేశీయులు ప్రయాణాల మీద నిషేధాలు ఎత్తి వేసే వరకూ వెయిట్ చేయాల్సిందేనని కేంద్ర హోంశాఖ స్పష్టం చేస్తోంది. భారత్ కు వచ్చిన ఓసీఐ కార్డుదారులు తమ దేశంలో ఎన్ని రోజులైనా ఉండి పోవచ్చని చెబుతున్నారు. ప్రస్తుతానికి విదేశీయులకు మంజూరు చేసే వీసాలపై తాత్కాలిక రద్దును అమలు చేస్తున్నారు.
అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభమైన తర్వాత ముఫ్పై రోజుల వరకూ వీసా చెల్లింపులు ఉండనున్నాయి. అయితే.. దీనికి సంబంధించి కొందరికి మాత్రం మినహాయింపులు ఇవ్వనున్నారు. తాజాగా హోంశాఖ ఇచ్చిన ఆదేశాల ప్రకారం దౌత్యవేత్తలు.. అధికారులు.. ఐరాస.. ఇతర అంతర్జాతీయ సంస్థలకు చెందిన వారిపై ఎలాంటి బ్యాన్ ఉండదని స్పష్టం చేశారు.