Begin typing your search above and press return to search.
బ్లాక్ మనీపై పోరు బలోపేతమవుతోందా?
By: Tupaki Desk | 1 Sep 2017 11:04 AM GMTదేశాన్ని పట్టి కుదిపేస్తున్న నల్లధనం(బ్లాక్ మనీ)పై పోరును ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రతరం చేశారా? ఇప్పటికే నోట్ల రద్దుతో సంచలనం సృష్టించిన ఆయన ఇకపై.. తనతో కలిసివచ్చే ఇతర దేశాలతోనూ ఈవిషయంపై ఒప్పందాలు చేసుకుంటున్నారా? విదేశాలతో కలసి నల్లధనంపై ఉద్యమం పెంచుతారా? అంటే ఔననే సమాధానమే వస్తోంది. తాజాగా భారత్ కు వచ్చిన స్విట్జర్లాండ్ అధ్యక్షురాలు డోరిస్ ల్యూథర్డ్ తో ప్రధాని మోదీ గురువారం విస్తృతస్థాయి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా నల్లధనం, పన్ను ఎగవేతల నిర్మూలనకు పరస్పర సహకారం కొనసాగించాలని భారత్ - స్విట్జర్లాండ్ లు నిర్ణయించాయి.
మూడు రోజుల భారత పర్యటనకు వచ్చిన డోరిస్ ల్యూథర్డ్ భారత్ లో ప్రజా సంక్షేమానికి చేపడుతున్న కార్యక్రమాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఇక, మోదీ మాట్లాడుతూ.. ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకత లోపించడం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోందని మోదీ చెప్పారు. ‘ నల్లధనం, హవాలా సొమ్ము, ఆయుధాలు - డ్రగ్స్ తో ముడిపడి ఉన్న డబ్బు.. ఇలా ఏదైనా కావొచ్చు.. ఈ అంతర్జాతీయ సమస్య పరిష్కారానికి స్విట్జర్లాండ్ తో కలిసి పోరాడుతాం. పన్ను సమాచారం ఆటోమేటిక్ మార్పిడికి సంబంధించి రెండు దేశాల మధ్య గతేడాది ఒప్పందం కుదిరింది.’ అని మోదీ అన్నారు. ఆర్థిక సంబంధాల్లో విదేశీ పెట్టుబడులు కీలకమని, స్విస్ పెట్టుబడిదారులకు భారత్ స్వాగతం పలుకుతోందని తెలిపారు.
ఆర్థిక లావాదేవీల సమాచారాన్ని భారత్ తో పంచుకోవడానికి ఉద్దేశించిన ఉమ్మడి డిక్లరేషన్ ను తమ పార్లమెంట్ ఈ ఏడాది చివరినాటికి ఆమోదించొచ్చని ల్యూథర్డ్ ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతో 2019 నుంచి భారత్ ఆ సమాచారాన్ని పొందే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకత కోసం తమ దేశం అంతర్జాతీయ నిబంధనలను పాటిస్తోందని చెప్పారు. స్విట్జర్లాండ్‌లో మనీలాండరింగ్ కు వ్యతిరేకంగా అత్యంత కఠిన చట్టాలు అమలవుతున్నాయని వెల్లడించారు. రైల్వేలు సహా ఇతర రంగాల్లో భారత్ కు అధునాతన మౌలిక వసతులు అందించేందుకు తమ దేశం సిద్ధంగా ఉన్నట్లు ల్యూథర్డ్ చెప్పారు. మొత్తానికి మోదీ - ల్యూథర్డ్ చర్చలు నల్లధనంపై పోరు దిశగా పెద్ద ముందడుగని అంటున్నారు విశ్లేషకులు.