Begin typing your search above and press return to search.

చైనా రికార్డు బద్దలు.. ఇకపై మనమే నెంబర్ వన్..!

By:  Tupaki Desk   |   11 Nov 2022 10:30 AM GMT
చైనా రికార్డు బద్దలు.. ఇకపై మనమే నెంబర్ వన్..!
X
భారతీయులు చాలా సిగ్గరని తరుచూ వింటూనే ఉంటాం.. అయితేనేం ఆ అరుదైన రికార్డు మన పేరిటే నమోదు కాబోతుండటం విశేషం. ఈ రేర్ ఫిట్ ను భారత్ మరి కొద్దిరోజుల్లోనే చేరుకోబోతుందని ఐక్య రాజ్య సమితి తాజాగా ప్రకటించింది. దీంతో ఆ రికార్డు ఏంటా అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఆ సస్పెన్స్ వీడాలంటే మాత్రం ఈ కథనం పూర్తి వరకు చదవాల్సిందే..!

ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం ఏది? అని అడిగితే ప్రతి ఒక్కరూ చైనా అని ఠక్కున చెప్పేస్తుంటారు. ఎన్నో ఏళ్లుగా చైనానే అత్యధిక జనాభా కలిగిన దేశంగా నిలుస్తుండటమే ఇందుకు కారణం. అయితే ఇకపై చైనా పేరు చెబితే మాత్రం మీరు అప్డేట్ కానట్లే లెక్క. ఎందుకంటే 2023 సంవత్సరంలో భారత్ ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించబోతుంది.

ఈ విషయాన్ని స్వయంగా ఐక్య రాజ్య సమితినే స్వయంగా వెల్లడించింది. దీంతోపాటు 2022 నవంబర్ 15 నాటికి ప్రపంచ జనాభా ఎనిమిది బిలియన్లు (800 కోట్లకు) చేరుకుంటుందని ఐరాస ప్రకటించింది. యూఎన్ వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ లో భాగంగా 2022 జూలై 11న ప్రపంచ దినోత్సవాన్ని పురస్కరించుకొని జనాభా వివరాలను సేకరించినట్లు తెలిపింది.

ఇక త్వరలోనే ప్రపంచ జనాభా ఎనిమిది బిలియన్లకు చేరుకుంటుంటంతో యూఎన్ వరల్డ్ పాపులేషన్ చేపట్టిన సర్వే వివరాలు తాజాగా వెల్లడించారు. దీని ప్రకారంగా 2050 నాటికి ప్రపంచ జనాభా సగానికి పైగా కేవలం ఎనిమిది దేశాల్లోనే నమోదు అవుతుందని పేర్కొంది. వీటిలో భారత్.. పాకిస్తాన్.. పిలిప్పిన్స్.. ఈజిప్ట్.. ఇథియోపియా.. కాంగో.. నైజీరియా.. టాంజానియా దేశాలు ఉన్నాయి.

మరోవైపు 1950 తర్వాత జనాభా పెరుగుదల 2020లో తొలిసారిగా ఒక్క శాతం మేర తగ్గినట్లు సర్వేలో వెల్లడైంది. అదేవిధంగా 2030 నాటికి ప్రపంచ జనాభా 8.5 బిలియన్లకు చేరుకోనుంది. 2050 నాటికి 9.7 బిలియన్లకు.. 2080 నాటికి 10.4 బిలియన్లకు ప్రపంచ జనాభా చేరుకుంటుందని ఐరాస వెల్లడించింది. దీంతో భారతీయులు మొహమాటస్తులేమో గానీ.. అందులో మాత్రం జేమ్స్ అని పలువురు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.