Begin typing your search above and press return to search.

5జీ ముచ్చట్లు చెప్పుకొచ్చారు

By:  Tupaki Desk   |   6 Jan 2017 5:37 AM GMT
5జీ ముచ్చట్లు చెప్పుకొచ్చారు
X
3జీనే మొత్తంగా అందుబాటులోకి రాని పరిస్థితి. అప్పుడే4జీ వచ్చేసింది. భారత్ లో టెలికం కంపెనీల మధ్య నెలకొన్న పోటీ పుణ్యమా అని ఇప్పుడిప్పుడే 4జీ సేవలు ఊపందుకుంటున్నాయి. దేశ వ్యాప్తంగా ప్రజలకు 4జీ అందుబాటులోకి వచ్చేందుకు మరింత కాలం పడుతుందన్న అంచనాలు వినిపిస్తున్న వేళ.. అప్పుడే 5జీ మాటలు వచ్చేశాయి. రోజురోజుకీ పెరుగుతున్న సాంకేతికత మరింత వేగాన్ని.. వేగవంతమైన జీవితాన్ని ఇస్తున్న సంగతి తెలిసిందే.

4జీలోనే డేటా ఓ రేంజ్ స్పీడ్ ఉంటున్న వేళ.. 5జీ ఎలా ఉంటుంది? అది కానీ అందుబాటులోకి వస్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? కొత్త తరం ఇంటర్నెట్ వ్యవస్థలైన క్లౌడ్ కంప్యూటింగ్.. వర్చువలైజేషన్.. లాంటి అంశాలపై తిరుపతిలో జరుగుతున్న సైన్స్ కాంగ్రెస్ లో ప్రముఖులు మాట్లాడారు. ఈ సందర్భంగా 5జీ సేవలు ఎలా ఉంటాయి? ఇది కానీ అందుబాటులోకి వస్తే పరిస్థితులు ఎంతగా మారిపోతాయన్న విషయాన్ని చెప్పుకొచ్చారు.

ప్రస్తుతానికి 5జీ అన్నది నిర్వచన దశలోనే ఉన్నట్లుగా నిపుణులు చెబుతున్నారు. 5జీ అందుబాటులోకి రావటానికి మరో మూడేళ్లు పట్టే వీలుందని చెప్పుకొచ్చారు. ఈ టెక్నాలజీ కానీ అందుబాటులోకి వస్తే డేటా వేగం వెయ్యి రెట్లు పెరుగుతుందని..బ్యాటరీ అయుష్షు మరింత పెరుగుతుందని చెబుతున్నారు. ప్రస్తుత 4జీలో బ్యాటరీ ఎక్కువగా వినియోగమవుతూ.. రోజుకు రెండుసార్లు ఛార్జింగ్ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

5జీ కానీ అందుబాటులోకి వస్తే.. డేటా వేగం పెరగటంతో పాటు.. బ్యాటరీ వినియోగం కనీసస్థాయిలో ఉండేలా ఏర్పాటు ఉంటుందని చెబుతున్నారు. దీని వల్ల బ్యాటరీ లైఫ్ పెరిగే వీలుందని చెబుతున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే 5జీ 2020 నాటికి అందరికి అందుబాటులోకి వస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. సో.. 5జీ జనజీవన స్రవంతిలోకి రావటానికి అట్టే సమయం లేదన్న మాట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/