Begin typing your search above and press return to search.

లండన్‌ లో జాతీయ జెండాకు అవమానం

By:  Tupaki Desk   |   28 Jan 2019 4:50 PM GMT
లండన్‌ లో జాతీయ జెండాకు అవమానం
X
బ్రిటీషోళ్లు ఒకప్పుడు మనల్ని పరిపాలించారు. మనల్ని మాత్రమే ఈ ప్రపంచంలో చాలా దేశాలు ఒకప్పుడు బ్రిటీష్‌ ఆధీనంలోనే ఉండేవి. అందుకే.. ఇప్పటికీ వారికి ఇతర దేశాలంచే చాలా చిన్నచూపు ఉంటుంది. వారిదే మాత్రమే దేశం.. వారిది మాత్రమే జెండా.. మిగిలిన వారివి కాదు అన్నట్లుగా బిహేవ్‌ చేస్తుంటారు. అలాంటి సంఘటనే మొన్న రిపబ్లిక్‌ డే రోజులు లండన్‌ లో జరిగింది.

లండన్‌ భారతీయ హై కమిషన్‌ కార్యాలయం ఎదుట కొంతమంది ఖలిస్తాన్ మద్దుతుదారులు ఆందోళన నిర్వహించారు. ఆందోళన చేయడమే కాదు మన జాతీయ జెండాను అవమానించారు. జాతీయ జెండాను కాలితో తొక్కి కాల్చేశారు. ఇంత జరుగుతున్నా.. అక్కడ కాపలా ఉన్న బ్రిటీష్‌ సిబ్బంది చోద్యం చూశారు తప్ప.. ఆపే ప్రయత్నం చేయలేదు. అదే వేరే దేశంలో అయితే.. స్పాట్‌ లో కాల్చేసే వాళ్లు. కానీ అక్కడుంది తోలు మందం బ్రిటీషోళ్లు కదా. ఇలా జరగడం ఇది రెండోసారి. గతంలో ఓసారి రిపబ్లిక్‌ డే రోజే ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది.

భారత హైకమిషన్‌ కార్యాలయం ఎదుట ఈ సంఘటనపై భారత ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. గణతంత్ర దినోత్సవం రోజున ఇలాంటి సంఘటనలు జరుగుతాయని ముందే హెచ్చరించనా.. బ్రిటన్‌ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఘాటుగా లేఖలో హెచ్చరించింది. దీనిపై బ్రిటన్‌ అధికారులు రెస్పాండ్‌ అయ్యారు. ఇతర దేశాల పట్ల తాము గౌరవ భావంతో ఉంటామని ప్రకటించింది. ముఖ్యంగా భారత్‌ తో తాము సన్నిహిత సంబంధాలు కోరుకుంటున్నట్లు ప్రకటించింది. ప్రకటన అయితే చేస్తుంది కానీ.. బ్రిటన్‌ బుద్ధి మాత్రం ఎప్పుడూ కుక్కతోక వంకర అన్నట్లుగానే ఉంది.