Begin typing your search above and press return to search.

జ‌స్ట్ ప‌దేళ్లు.. ఇండియా నెంబ‌ర్ త్రీ

By:  Tupaki Desk   |   14 Nov 2017 8:48 AM GMT
జ‌స్ట్ ప‌దేళ్లు.. ఇండియా నెంబ‌ర్ త్రీ
X
ప‌లు రంగాల్లో అభివృద్ధి దిశ‌గా దూసుకుపోతున్న భార‌త్ మరో ఘ‌న‌త సాధించ‌నుంద‌ట‌. భ‌విష్య‌త్‌ లో జ‌పాన్‌ ను వెన‌క్కు నెట్టేసి ప్ర‌పంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక‌శ‌క్తిగా అవ‌త‌రిస్తుంద‌ట‌. ఇదేదో మ‌న నాయ‌కులు చెప్పిన మాట‌కాదు. ఇప్ప‌టికే బ్రిక్స్‌ దేశాల్లో బ్రెజిల్‌ - రష్యాలను వెనక్కి నెట్టి భారత్‌ రెండో స్థానానికి చేరుకుంది. అంతేకాదు 2019 కల్లా ఫ్రాన్స్‌ - బ్రిటన్‌ లను దాటి ప్రపంచంలో ఐదో శక్తిమంతమైన దేశంగా భారత్‌ అవతరిస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలోనే వచ్చే పదేళ్లలో జపాన్‌ ను వెనక్కు నెట్టి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఎకానమీగా భారత్‌ అవతరిస్తుందని ఓ విదేశీ సంస్ధ త‌న‌ నివేదిక‌లో వెల్ల‌డించింది. 2028 కల్లా భారత్‌ జపాన్‌ ను జీడీపీని అధిగమిస్తుందని ప్ర‌క‌టించింది.

2028 కల్లా స్థూల జాతీయోత్ప‌త్పి(జీడీపీ)లో జర్మనీ - జపాన్‌ లను భారత్‌ అధిగమిస్తుందని బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా మెరిల్‌ లించ్‌ తన నివేదిక‌లో పేర్కొంది. వచ్చే పదేళ్లలో భారత్‌ జీడీపీ 10 శాతం పెరుగుతుందని వెల్లడించింది. ‘ఇండియా 2028 : ది లాస్ట్‌ బ్రిక్‌ ఇన్‌ ది వాల్‌’ పేరుతో విడుద‌ల చేసిన ఈ నివేదిక‌లో ఈ వివ‌రాల‌న్నీ పేర్కొంది. భవిష్యత్‌ లో కుటుంబంలో పని చేసే వారి సంఖ్య పెరిగి భారత్‌ జీడీపీ భారీగా వృద్ధి చెందుతుందని స్ప‌ష్టంచేసింది.

ఇక భార‌త‌దేశంలో అత్య‌ధిక అభివృద్ధి సేవారంగం ద్వారానే జ‌రుగుతుందని ఈ నివేదిక‌ వెల్లడించింది. అంతర్జాతీయ స్థాయిలో భార‌త మార్కెట్ విస్త‌ృతస్థాయిలో అభివృద్ధి చెందుతున్నట్లు తెలిపింది. పౌరుల ఆదాయం పెరుగుతోందని, మరో వైపు డిమాండ్‌ కూడా పెరుగుతుండటం దేశానికి ఉజ్వల భవిష్యత్‌ ఉన్నట్లు చెప్పకనే చెబుతోందని ఆ నివేదిక వివరించింది.