Begin typing your search above and press return to search.
కేసీఆర్ కు ఎంపీ సంతోష్ భోజనం పెట్టాడని గగ్గోలు.. ఆయన కొడుకు పెడితే తప్పా?
By: Tupaki Desk | 19 Nov 2022 3:50 PM GMTతెలంగాణ సీఎం కేసీఆర్ కు ఎప్పుడూ వెన్నంటి ఉండే వ్యక్తి ఎవరు అంటే ‘సంతోష్’ అని చెప్పొచ్చు. సంతోష్ ఎవరో కాదు.. కేసీఆర్ సడ్డకుడి కుమారుడు.. భార్య వాళ్ల చెల్లి కొడుకు. కేసీఆర్ కు కొడుకు వరస అవుతాడు. కేటీఆర్ తోపాటు సంతోష్ కూడా చిన్నప్పటి కేసీఆర్ వద్దే పెరిగారు. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ వ్యవహారాలు, మీడియా, పార్టీ వ్యవహారాలు చూసుకునేవారు. కేసీఆర్ తోపాటు టూర్లు, పర్యటనల్లో ఆయనతోపాటే పడుకునే వ్యక్తుల్లో సంతోష్ ఒకరు.
సంతోష్ తన కొడుకు వరుస కావడం.. సేవలను గుర్తించి కేసీఆర్ ‘రాజ్యసభ’ సీటు ఇచ్చి గౌరవించాడు. రాజ్యసభ ఎంపీ సీటు ఇచ్చినా కూడా కేసీఆర్ వెన్నంటి ఉండడాన్ని సంతోష్ విస్మరించలేదు. ఇప్పటికీ కేసీఆర్ తోనే ఉంటున్నాడు. అయితే అది టీఆర్ఎస్ పార్టీలో అందరికీ తెలుసు. ఒక తండ్రికి కొడుకులా సేవ చేస్తున్నాడు. కేసీఆర్ కు తిండి, బట్ట నుంచి అన్నింటిని దగ్గరుండి సంతోష్ అందిస్తాడు.
అయితే ఇది తెలియని ఇండియా టుడే జర్నలిస్ట్ రాజ్ దీప్ ఒక ఇంటర్వ్యూలో హాట్ కామెంట్స్ చేస్తున్నారు. ఆయన కేసీఆర్ ను కలిసిన సందర్భంలో సంతోష్ ఆయనకు సేవలు చేయడంపై విస్మయం వ్యక్తం చేశాడట.. ఎంపీ సంతోష్ గురించి రాజ్ దీప్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.
బీజేపీ నేతలు దీనికి సంబంధించిన వీడియోను నెట్టింట వైరల్ అవుతున్నాయి. బీజేపీ నేతలు దీనికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు.
ఆ వీడియోలో ‘ఓ రోజు సీఎం కేసీఆర్ ఇంటికి వెళ్లాను. అక్కడ కేసీఆర్ కు ఓ వ్యక్తి ఆహారాన్ని సర్వ్ చేస్తున్నాడు. అయితే అది రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ అని తెలియడంతో షాక్ అయ్యాను అని ఉంది.
అయితే సంతోష్ ఎవరన్నది రాజ్ దీప్ కు తెలియదు. కేసీఆర్ తమ్ముడి కొడుకు అన్న విషయం తెలియకనే రాజ్ దీప్ అన్నాడు. కానీ తెలిశాక మాత్రం ఆయన వ్యాఖ్యలకు విలువ లేకుండా పోయింది.
కేసీఆర్ కు సంతోష్ కు కూడా కొడకన్న సంగతి రాజ్ దీప్ కు తెలియదు. పెద్దనాన్నను చూసుకోవడం కూడా తప్పా? అని టీఆర్ఎస్ శ్రేణులు కౌంటర్ ఇస్తున్నారు. బీజేపీ ట్రోలింగ్ పై మండిపడుతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.