Begin typing your search above and press return to search.
మోదీకి షాక్.. ఓటమి తప్పదా.?
By: Tupaki Desk | 25 Jan 2019 4:29 AM GMTఎన్నికల ముందు సర్వేలు కొందరికి ఆనందాన్ని ఇస్తే ఇంకొందరికి షాక్ ఇస్తాయి. ఇప్పుడు అలాంటి షాకే ప్రధాని మోదీకి తగిలింది. ఇప్పటికిప్పుడు దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగితే.. మోదీ మళ్లీ ప్రధాని అయ్యే అవకాశం లేదని ఇండియా టుడే – కార్వీ ఇన్ సైట్స్ నిర్వహించిన మూడ్ ఆఫ్ ద నేషన్ పోల్ లో తేలింది.
2014 ఎన్నికలతో పోలిస్తే.. ఎన్డీయేకు 99 సీట్లు తగ్గే అవకాశం ఉందని సర్వేఅంచనా వేసింది. దీన్నిబట్టి చూస్తే.. ఎన్టీయేకు వచ్చే సీట్లు 237. కానీ మ్యాజిక్ ఫిగర్ 272. ఇక యూపీఏ మిత్రపక్షాలకు 166 సీట్లు వచ్చే అవకాశం ఉంది. గత ఎన్నికలతో పోలిస్తే.. 106 సీట్లు ఎక్కువ. ఇక అటు ఎన్టీయోలో కానీ యూపీఏలో కానీ మిగిలిన పార్టీలు 140 స్థానాల్లో గెలుపొందుతారు. అంటే.. ప్రభుత్వ ఏర్పాటుకు వీళ్లే కీలకం కానున్నారు. మొత్తంగా ఎన్డీయోకు 35 శాతం - యూపీఏకు 33 శాతం ఓట్లు పడతాయని సర్వే తేల్చిచెప్పింది.
సర్వే ఫలితాలు మోదీకి వ్యతిరేకంగా - కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నా మొత్తంగా వీటిని నమ్మలేం. ఇవి ఇప్పటికిప్పుడు చేసిన సర్వే ఫలితాలు. ఎన్నికల నాటికి మారే అవకాశం ఉంది. ఇక అన్నింటికి మించి ఎన్డీయేకు కావాల్సిన సీట్లు సుమారు 40. ఎన్నికల టైమ్ కు కాస్త పుంజుకుంటే.. ఫలితాల్లో తప్పుకుండా మార్పు ఉంటుంది. ఒకవేళ మోదీ ప్రభుత్వంపై వ్యతిరేకత ఇంకా ఎక్కువుంటే.. యూపీయే - దాని మిత్రపక్షాలు - ఎస్పీ - బీఎస్పీ - తృణమూల్ అన్నీ కలిస్తే.. కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఈజీ అవుతుంది. సో.. మరి మోదీ మ్యాజిక్.. ఈ మూడు నెలల్లో పనిచేస్తుందేమో వెయిట్ అండ్ సీ.