Begin typing your search above and press return to search.

ఎంపీల‌కు ర్యాంకులు ఇచ్చిన ఇండియాటుడే

By:  Tupaki Desk   |   15 April 2019 5:30 AM GMT
ఎంపీల‌కు ర్యాంకులు ఇచ్చిన ఇండియాటుడే
X
లోక్ స‌భ గ‌డువు ముగుస్తోంది. కొత్త స‌భ‌కు జ‌రుగుతున్న ఎన్నిక‌ల ప్ర‌క్రియ మే 23తో పూర్తి కానుంది. ఆ రోజు వెల్ల‌డ‌య్యే ఫ‌లితాల‌తో కొత్త స‌భ కొలువు తీర‌నుంది. మ‌రి.. ఐదేళ్లుగా లోక్ స‌భ‌కు ప్రాతినిధ్యం వ‌హించిన ఎంపీల ప‌నితీరు ఎలా ఉంది? అన్న విష‌యాన్ని చూస్తే.. అలా మ‌దింపు చేసిన ప్ర‌ముఖ మీడియా సంస్థ ఇండియా టుడే తాజాగా ర్యాంకుల్ని ప్ర‌క‌టించింది.

ర్యాంకుల్ని తేల్చ‌టానికి వీలుగా కొన్ని ప్ర‌మాణాల్ని సెట్ చేసింది. ఇందులో పార్ల‌మెంటుకు హాజ‌రైన రోజులు.. అడిగిన ప్ర‌శ్న‌లు.. ప్ర‌వేశ పెట్టిన ప్రైవేటు బిల్లులు.. ఎంపీల్యాడ్స్ వినియోగం.. వారిపై ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌జాభిప్రాయం ఎలా ఉందన్న విష‌యాన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకొని ర్యాంకుల్ని డిసైడ్ చేశారు. అయితే.. స‌భ‌లోని 543 మంది ఎంపీల్లో 416 మందిని మాత్ర‌మే ర్యాంకింగ్ లెక్క‌ల్లోకి తీసుకున్నారు. ప్ర‌ధాని మోడీతో పాటు మ‌రికొంద‌రు ప్ర‌ముఖులు.. మంత్రులు.. ప్ర‌తిప‌క్ష నేత‌.. స్పీక‌ర్.. డిప్యూటీ స్పీక‌ర్ ఇలా ప‌లువురు లోక్ స‌భ రిజిస్ట‌ర్ లో సంత‌కం చేయాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. దీంతో.. వారు సంత‌కాలు చేయ‌లేదు. దీంతో వీరి హాజ‌రు న‌మోదు కాలేదు. అందుకే వీరిని లెక్క‌లోకి తీసుకోలేదు.

ఇండియాటుడే ర్యాంకింగ్స్ లో వెల్ల‌డైన ఆస‌క్తిక‌ర అంశాలు చూస్తే..

+ బీజేపీకి చెందిన బిహార్ ఎంపీ జ‌నార్ద‌న్ సింగ్ సిగ్రివాల్ అన్నింట్లోనూ అత్యుత్త‌మ స్థానంలో నిలిచి ఫ‌స్ట్ ర్యాంక్ ను సొంతం చేసుకున్నారు. ఆయ‌న‌కు ఏ ప్ల‌స్ ర్యాంకు వ‌చ్చింది.

+ టాప్ టెన్ ర్యాంకులు సాధించిన ప్ర‌ముఖుల్లో బీజేపీకి చెందిన మీనాక్షి లేఖి (7).. ఎన్సీపీకి చెందిన సుప్రియా సూలే (10) ర్యాంకును సొంతం చేసుకున్నారు.

+ చివ‌రి స్థానాల్లో నిలిచిన‌వారిలో కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ.. యూపీఏ ఛైర్ ప‌ర్స‌న్ సోనియాలు చివ‌రి స్థానాల్లో నిల‌వ‌టం గ‌మ‌నార్హం.

+ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ లోక్‌ సభ హాజ‌రు 52 శాతంగా న‌మోదైంది. ఎంపీ ల్యాడ్స్ కు సంబంధించి ఐదేళ్ల‌కు రూ.25 కోట్లు కేటాయించ‌గా.. అందులో రూ.19.6 కోట్లు మాత్ర‌మే అభివృద్ధి ప‌నుల‌కు ఖ‌ర్చు చేశారు. దీంతో ఆయ‌న‌కు 387వ ర్యాంక్ ల‌భించింది. ఆయ‌న కంటే కాస్తంత మెరుగైన హాజ‌రు (60శాతం) ఉన్న సోనియాకు 381వ ర్యాంక్ వ‌చ్చింది.

+ స‌భా చ‌ర్చ‌ల్లో రాహుల్ ముందుండి న‌డిపినా.. ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో ప్ర‌శ్న‌లు అడ‌గ‌క‌పోవ‌టం.. ప్రైవేటు బిల్లులు ప్ర‌వేశ పెట్ట‌క‌పోవ‌టంతో ఆయ‌న ర్యాంకింగ్ లో వెనుక‌ప‌డ్డారు.

+ కాంగ్రెస్‌ కు చెందిన 39 మంది ఎంపీల్లో 11 మందికి అత్యల్ప డీ - డీ ప్లస్‌ గ్రేడులు వ‌చ్చాయి.

+ బీజేపీకి చెందిన 195 మంది ఎంపీల్లో 33 మందికి డీ - డీ ప్లస్‌ గ్రేడులు వచ్చాయి.

+ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఎన్నికై టీడీపీలో చేరిన నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి 416వ ర్యాంకుతో అట్టడుగున ఉన్నారు.

+ అదే రీతిలో క‌ర్నూలు ఎంపీ.. , బుట్టా రేణుక 337వ ర్యాంకు పొందారు. టీడీపీ ఎంపీలు మాగంటి వెంకటేశ్వరరావు 323వ ర్యాంకుతో డీప్లస్‌ గ్రేడ్ - కేశినేని శ్రీనివాస్‌ 348వ ర్యాంకు డీప్లస్‌ గ్రేడ్ - జేసీ దివాకర్‌ రెడ్డి 401వ ర్యాంకు డీ గ్రేడ్ ర్యాంకులో నిల‌వ‌టం గ‌మ‌నార్హం.