Begin typing your search above and press return to search.

ప్ర‌తిప‌క్ష విఫ‌ల‌మైందా? ఇండియా టుడే స‌ర్వే ఏం చెప్పిందంటే

By:  Tupaki Desk   |   17 Aug 2021 1:30 PM GMT
ప్ర‌తిప‌క్ష విఫ‌ల‌మైందా? ఇండియా టుడే  స‌ర్వే  ఏం చెప్పిందంటే
X
దేశంలో ప్ర‌జ‌లు ఎదుర్కొన్న స‌మ‌స్య‌ల‌ను ప‌ట్టి చూపుతూ.. కేంద్రంపై యుద్ధం ప్ర‌క‌టిస్తామ‌ని.. ప‌దే ప‌దే చెప్పిన ప్ర‌తిప‌క్షాలు.. ఈ విష‌యంలో విఫ‌ల‌మ‌య్యాయా? కేంద్రంలోని మోడీ స‌ర్కారుపై ఏమీ చేయ‌లేక పోయాయా? అంటే.. ఔన‌నే అంటోంది.. ప్ర‌ముఖ మీడియా సంస్థ ఇండియా టుడే చేసిన దేశ‌వ్యాప్తం స‌ర్వే! దేశంలో ఏడాదిన్న‌ర‌గా కోవిడ్‌తో అల్లాడుతోంది. దీంతో ప్ర‌జ‌ల జీవ‌న‌ప్ర‌మాణాలు భారీగా దెబ్బ‌తిన్నాయి. ఈ క్ర‌మంలో విప‌క్షాలు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి.. ప్ర‌జ‌ల‌కు అవ‌స‌ర‌మైన విధంగా మోడీని లైన్‌లో పెడ‌తాయ‌ని.. అంద‌రూ భావించారు. కానీ, దిశ‌గా విప‌క్షాలు ప‌నిచేయ‌డంలో విఫ‌ల‌మ‌య్యాయ‌ని.. స‌ర్వే పేర్కొంది.

అయితే.. మోడీ ఎఫెక్ట్‌తో విప‌క్షాల మ‌ధ్య ఐక్య‌త మాత్రం క‌నిపించింద‌ని.. స‌ర్వే తెలియ‌జేయ‌డం గ‌మ నార్హం. విష‌యంలోకి వెళ్తే.. ఏటా ప్ర‌తి ఆగ‌స్టులోనూ.. ఇండియా టుడే.. ప్ర‌భుత్వాల ప‌నితీరుపై ప్ర‌జ‌ల‌ను క‌లుస్తోంది. అదేస‌మ‌యంలో విప‌క్షాల దూకుడు ఎలా ఉంద‌నే విష‌యాన్ని కూడా ప్ర‌జ‌ల నుంచి అభిప్రా యాల రూపంలో రాబ‌డుతోంది. ఈ క్ర‌మంలో ఈ ద‌ఫా చేసిన స‌ర్వేలో .. కేంద్రంపై విప‌క్షాలు యుద్ధం చేయ‌డంలో విఫ‌ల‌మ‌య్యాయ‌నే వాద‌న బ‌లంగా వినిపించ‌డం గ‌మ‌నార్హం.

ఇటీవ‌ల ముగిసిన పార్ల‌మెంటు వ‌ర్షాకాల స‌మ‌యంలో మోడీ స‌ర్కారుపై యుద్ధం చేసేందుకు ప్ర‌తిప‌క్షాలు రెడీ అయ్యాయి. ఈ క్ర‌మంలోనే ఎన్న‌డూ లేనిది.. విప‌క్షాలు మూడు సార్లు భేటీ అయ్యాయి. మ‌రీ ముఖ్యం గా కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ ఇచ్చిన బ్రేక్ ఫాస్ట్ భేటీకి వ‌చ్చి.. మోడీపై యుద్ధం చేసేందుకు, ప్ర‌భు త్వాన్ని ఎండ‌గ‌ట్టేందుకు కామ‌న్ ప్రోగ్రామ్ వ్యూహాన్ని కూడా రెడీ చేసుకున్నారు. మ‌రీ ముఖ్యంగా దేశాన్ని కుదిపేసిందంటూ.. పెగాస‌స్ స్పైవేర్‌పై పార్ల‌మెంటును స్తంభింప‌జేయాల‌ని నిర్ణ‌యించారు. అదేస‌మ‌యంలో రైతు వ్య‌తిరేక చ‌ట్టాల‌పై కూడా గ‌ళం వినిపించాల‌ని అనుకున్నారు. ఇంత‌వ‌ర‌కు బాగానే ఉన్నా.. ఇత‌ర విష‌యాల‌ను మాత్రం విప‌క్షాలు ప‌క్క‌న పెట్టాయి.

అంటే.. వ‌ర్షాకాల స‌మావేశాల్లో కేవ‌లం రెండు అంశాల‌ను మాత్ర‌మే ప‌ట్టుకుని విప‌క్షాలు వేలాడాయి. త‌ప్ప‌.. కీల‌క‌మైన, ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న అనేక క‌ష్టాల‌ను మాత్రం పూర్తిగా మ‌రిచిపోయాయ‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. వీటిలో క‌రోనా స‌మ‌యంలో ప్ర‌జ‌లు ప‌డ్డ ఇబ్బందులు, దీనికార‌ణంగా త‌లెత్తిన ఆర్థిక స‌మ‌స్య‌లు.. వంటివిష‌యాల‌ను నిల‌దీయ‌డం లోను, కేంద్రాన్ని ఇరుకున పెట్ట‌డంలోనూ విప‌క్షాలు పూర్తిగా విఫ‌ల‌మ‌య్యాయి. ఇదే విష‌యాలు స‌ర్వేలోనూ వెల్ల‌డ‌య్యాయి. నిజానికి మోడీ అనుస‌రిస్తున్న విధానాల‌తో పేద‌లు పేద‌లుగానే ఉండిపోతున్నార‌ని.. కార్పొరేట్ శ‌క్తులు బ‌లోపేతం అవుతున్నాయ‌నే వాద‌న ఉంది. ఈ విష‌యంలో ప్ర‌తిప‌క్షాలు ఆయ‌న‌ను నిల‌దీయ‌లేక పోయాయి. సో.. ఎలా చూసుకున్నా.. విప‌క్షాలు.. విఫ‌ల‌మ‌య్యాయ‌నే వాద‌నప్ర‌జ‌ల నుంచి బ‌లంగా వినిపించ‌డం గ‌మ‌నార్హం.