Begin typing your search above and press return to search.

టీ20 ప్రపంచ కప్ గెలవకున్నా మనమే నెంబర్ వన్..!

By:  Tupaki Desk   |   14 Nov 2022 10:40 AM GMT
టీ20 ప్రపంచ కప్ గెలవకున్నా మనమే నెంబర్ వన్..!
X
టీ20 వరల్డ్ కప్ సమరం ఇటీవల ముగిసింది. మెల్ బోర్న్ వేదికగా 2022 టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో పాకిస్తాన్-ఇంగ్లాండ్ జట్లు పోటీ పడ్డాయి. ఈ ఫైనల్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టు పాకిస్థాన్ జట్టుపై ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి టీ20 ప్రపంచ కప్ ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ లో బెన్ స్టోక్స్ అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన చేశాడు.

2019లో జరిగిన వన్డే ప్రపంచ కప్ విజేతగా ఇంగ్లాండ్ నిలిచింది. ఇక తాజాగా జరిగిన పరిమిత ఓవర్ల క్రికెట్ ప్రపంచ కప్ లోనూ ఇంగ్లాండ్ విజేతగా నిలిచింది. దీంతో ఏక కాలంలో రెండు ప్రపంచ కప్ లను గెలుపొందిన దేశంగా ఇంగ్లాండ్ సరికొత్త రికార్డును నెలకొల్పింది. టీ20 ప్రపంచ కప్ ముగియడంతో ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ ను తాజాగా విడుదల చేసింది.

టీ20 ఐసీసీ ర్యాంకింగ్స్ లో టీం ఇండియా నెంబర్ స్థానాన్ని దక్కించుకుంది. 268 రేటింగ్ పాయింట్స్‌ సాధించి టీం ఇండియా టాప్ ప్లేస్ దక్కించుకోగా ప్రపంచ కప్ నెగ్గిన ఇంగ్లాండ్ 265 రేటింగ్ పాయింట్స్ తో రెండో స్థానాన్ని దక్కించుకుంది. టీ20 రన్నర్ గా నిలిచిన పాకిస్తాన్ 258 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది.

నాలుగో స్థానంలో దక్షిణాఫ్రికా.. ఐదో స్థానంలో న్యూజిలాండ్.. ఆరవ స్థానంలో ఆస్ట్రేలియా.. ఏడో స్థానంలో వెస్టిండీస్.. ఎనిమిదవ స్తానంలో శ్రీలంక.. తొమ్మిదవ స్థానంలో బంగ్లాదేశ్.. పదో స్థానంలో అఫ్గనిస్థాన్ జట్లు నిలిచాయి. అలాగే పురుషుల టీ20 బెస్ట్ ఎలెవన్ జట్టును ఐసీసీ తాజాగా ప్రకటించింది.

ఈ టీంలో టీం ఇండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ.. సూర్య కుమార్ యాదవ్ లు స్థానం దక్కించుకున్నాడు. టీ20 ప్రపంచ కప్ లో కోహ్లీ 98.66 సగటుతో 296 పరుగులు చేశాడు. పాకిస్థాన్ పై అద్భుతమైన నాక్ ఆడి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. 2022 ప్రపంచ కప్ లో కోహ్లీ నాలుగు అర్ధ సెంచరీలు నమోదు చేశాడు.

అదేవిధంగా సూర్య కుమార్ యాదవ్ 189.69 సగటుతో 239 పరుగులు చేశాడు. ప్రపంచ కప్ లో మూడు అర్థ సెంచరీలు నమోదు చేశాడు. అదేవిధంగా హర్థిక పాండ్యా సైతం 12వ ఆటగాడిగా ఐసీసీ టీ20 బెస్ట్ ఎలెవన్ లో చోటు దక్కించుకొని సత్తా చాటాడు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.