Begin typing your search above and press return to search.
చైనాపై నిషేధం దిశగా భారత్
By: Tupaki Desk | 29 Dec 2022 10:32 AM GMTచైనా పుట్టించిన రోగం ప్రపంచాన్ని ఇప్పటికీ వదలడం లేదు. చైనాలోని వూహాన్ లో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు పాకి అన్ని దేశాల్లో మరణ మృదంగం వినిపించింది. తొలుత కూడా చైనా తమ దేశంలో పుట్టిన కరోనా రోగాన్ని దాచేసింది. అందరినీ అన్ని దేశాలకు పంపించి ప్రపంచమంతా పాకేలా చేసింది. అమెరికా, యూరప్ , భారత్ సహా ఎన్నో దేశాల్లో లక్షల్లో జనం చనిపోయారు. సామాన్యులు, ప్రముఖులు అన్న తేడా లేకుండా అందరినీ ఈ వైరస్ కబళించింది.
ఇప్పుడు మరోసారి చైనా అలాంటి కుట్రనే పన్నుతోంది. చైనాలో ఇప్పుడు కరోనా కల్లోలం చోటుచేసుకుంది. దాదాపు 25 కోట్ల మందికి కరోనా సోకింది. అక్కడి స్మశానాలు కరోనా మృతదేహాలతో నిండిపోయాయి. ఆస్పత్రులన్నీ కరోనా రోగులుతో ఫుల్ అయ్యాయి. ఇంతటి కరోనా కల్లోలం వేళ చైనా తీసుకున్న ఈ నిర్ణయం అన్ని దేశాలకు వణుకుపుట్టిస్తోంది. ప్రపంచంపైకి మరోసారి తన డేంజరస్ వైరస్ లను పంపించేందుకు చైనా కుట్ర పన్నుతోంది.
చైనాలో రూపాంతరం చెందిన మరో కొత్త వేరియంట్ తో ప్రపంచం అల్లాడిపోవాలని మరోసారి కుట్ర పన్నింది. ఇంతటి కరోనా కల్లోలం వేళ చైనా దేశం విదేశీ ప్రయాణాల మీద ఆంక్షలు ఎత్తి వేసింది. ఇది అత్యంత ప్రమాదకరమైన నిర్ణయంగా చెప్పొచ్చు. చైనా సరిహద్దులను తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజల్లో ఈ నిర్ణయం కొత్త జోష్ నింపిన ఈ చైనీయులు వచ్చే దేశాలు మాత్రం హడలి చస్తున్నాయి.
కరోనా పుట్టిన మూడేళ్ల తర్వాత అందరి ప్రజలకు విదేశాలకు వెళ్లేందుకు చైనా అనుమతించడం పెనుదుమారం రేపుతోంది. అక్కడి ప్రజలు సంతోషించినా.. అన్ని దేశాల వారు ఆందోళన చెందుతున్నారు. డిసెంబర్ చివరన న్యూఇయర్ సంబరాలను చేసుకునేందుకు చైనీయులకు విదేశాలకు వెళ్లేందుకు అక్కడి ప్రభుత్వం అనుమతించింది.
దీంతో చైనా దేశం నుంచి ప్రపంచ ప్రఖ్యాత టూరిస్ట్ ప్లేసులకు వెళ్లేందుకు చైనా ప్రజలు పర్యాటకులు పోటీపడుతున్నారు. మామూలు రోజుల్లో కంటే 10 రెట్లు బుకింగ్ అయ్యాయని చైనా టూరిస్ట్ వెబ్ సైట్లు చెబుతున్నాయి. ఇక విదేశాల నుంచి రాకపోకలు సాగించేవారికి క్వారంటైన్ నిబంధనను చైనా ఎత్తేస్తోంది. విదేశాల్లోని చైనీయులు కూడా స్వదేశానికి రావడానికి సిద్ధపడుతున్నారు.
మరోవైపు ఈ పరిణామం ప్రపంచ దేశాలకు గుబులు పుట్టిస్తోంది. చైనా పర్యాటకులతోపాటు కరోనా కూడా అన్ని దేశాలకు వచ్చిపడుతుందని భయాలు అన్ని దేశాలను వెంటాడుతున్నాయి. దీంతో ఈ కరోనా కల్లోలం వేళ చైనా నుంచి వచ్చే ప్రజలపై నిషేధం విధించేందుకు అమెరికా, భారత్ తోపాటు పలు యూరప్ దేశాలు సమాయత్తం అవుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా భారత ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసేందుకు నిర్ణయించినట్టు సమాచారం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.