Begin typing your search above and press return to search.

డెకాయ్ ఆపరేషన్ తో భారత్ విజయం

By:  Tupaki Desk   |   4 March 2019 11:19 AM GMT
డెకాయ్ ఆపరేషన్ తో భారత్ విజయం
X
డెకాయ్ ఆపరేషన్.. ఇప్పుడిదే చర్చనీయాంశంగా మారింది. భారత వాయుసేన విమానాలు పాకిస్తాన్ రాడర్లను, శత్రువిమానాలను బోల్తాకొట్టించి మరీ పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లాయి. బాలాకోట్ లో ఉన్న ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసి ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. ఇందుకోసం భారత్ ‘డెకాయ్ ఆపరేషన్’ను అమలు చేసింది. అసలు ఏంటి ఈ ఆపరేషన్.. ఎందుకు భారత్ విజయం సాధించిందన్నది హాట్ టాపిక్ గా మారింది.

శత్రువు దృష్టి మరల్చడానికి.. గందరగోళంలో పడేయడానికి డెకాయ్ ఆపరేషన్ వ్యూహాన్ని భారత్ అమలు చేసింది. డెకాయ్ ఆపరేషన్ లో భాగంగా పంజాబ్ లోని పాక్ సరిహద్దును ఆనుకొని ఉన్న పఠాన్ కోట్ ఎయిర్ బేస్ నుంచి కొన్ని సుఖోయ్ భారత విమానాలు పాక్ భూభాగం సరిహద్దుల్లో చక్కర్లు కొట్టాయి. జైషే మహ్మద్ ప్రధాన కేంద్రం బహవల్ పూర్ వద్దకు దూసుకెళ్లాయి. దీంతో పాకిస్తాన్ యుద్ధ విమానాలు, ఆర్మీ దృష్టి మొత్తం పంజాబ్ సరిహద్దులపైనే కాపు కాశాయి.

దీంతో పహారా కాస్తున్న పాక్ విమానాలు అటువైపే వెళ్లడంతో తెలివిగా భారత మిరాజ్ యుద్ధవిమానాలు పీవోకే పైకి వెళ్లాయి. కాశ్మీర్ నుంచి బయలు దేరి ఉగ్రశిబిరాను నేలమట్టం చేశాయి. తమ పనిని భారత వైమానిక దళాలు ఎలాంటి ఆటంకం లేకుండా పూర్తిచేశాయి. పాకిస్తాన్ గగనతలంలోకి వెళ్లి ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేశాయి.

ఈ డెకాయ్ ఆపరేషన్ ద్వారానే భారత్ అనూహ్య విజయం సాధించింది. సరికొత్త వ్యూహంతో పాకిస్తాన్ ఆర్మీని బోల్తా కొట్టించి శత్రుమూకలను హతమార్చింది. యుద్ధం మేఘాలు వీడిపోవడంతో ఇప్పుడు భారత వ్యూహాంపై వార్తలు బయటకు వస్తున్నాయి.