Begin typing your search above and press return to search.
వెనక్కి తగ్గే ఆలోచన చైనాకి ఉందా ? లేదా ?
By: Tupaki Desk | 31 July 2020 10:30 AM GMTభారత్, చైనా మధ్య ఉద్రిక్తతలు కొంచెం తగ్గినట్లే కనిపిస్తున్నా కూడా లోతుగా చూస్తే , ఆ పరిస్థితులు కనిపించడంలేదు. సరిహద్దుల నుంచి ఇప్పుడే బలగాలను వెనక్కి తీసుకోవడానికి చైనా ఇష్టపడటం లేదా , భారత్ ను ఆర్థికంగా దెబ్బకొట్టడమే లక్ష్యంగా ఉపసంహరణ ప్రక్రియలో తాత్సారం చేస్తోందా అంటే జరుగుతున్న పరిణామాలని చూస్తుంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. గల్వాన్ ఘర్షణ అనంతరం సరిహద్దుల్లో శాంతి స్థాపన కోసం తూర్పు లద్దాఖ్ లో ఎల్ ఏసీ వెంబడి బలగాలను సత్వరం వెనక్కి తీసుకోవాలని భారత్, చైనా నిర్ణయించాయి. ఇందుకోసం డీడీపీ శ్రీకారం చుట్టాయి. ఎప్పటికప్పుడు కమాండర్ల స్థాయిలో చర్చలు జరుపుతూ పరిస్థితులను సమీక్షిస్తున్నాయి. ప్రక్రియ చాన్నాళ్ల క్రితమే మొదలైనా.. ఇప్పటికీ ఇరు దేశాల బలగాలు చాలా చోట్ల ఎల్ ఏసీకి దగ్గర్లోనే ఉన్నాయి.
దీనితో భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకునేందుకుగాను మరోసారి కమాండర్ల స్థాయి సమావేశాన్ని గురువారం నిర్వహించాలని భారత్, చైనా మొదట నిర్ణయం తీసుకోగా , భేటీలో తీసుకోవాల్సిన ఎజెండాపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఆ సమావేశం కార్యరూపం దాల్చలేదని సమాచారం. . గల్వాన్ ఘర్షణ తర్వాత భారత్-చైనాల మధ్య ఇప్పటివరకు నాలుగు సార్లు కమాండర్ల స్థాయి చర్చలు జరిగాయి. తూర్పు లద్దాఖ్ లోని పాంగాంగ్ త్సొ వద్ద నెలకొన్న ఉద్రిక్తతలను తొలగించడంపైనే చైనా సైన్యం ప్రధానంగా దృష్టిసారించింది. దానిపైనే తొలుత చర్చలు జరపాలని కోరగా.... భారత్ మాత్రం అన్ని చోట్లా ఉద్రిక్తతలను తొలగిద్దామని, సమావేశపు ఎజెండాలో అన్నింటినీ చేరుద్దామని డిమాండ్ చేస్తోంది. దీనికి చైనా ముందుకు రావడం లేదు.
ఎల్ ఏసీ వెంబడి భూభాగం చైనా వైపు కాస్త చదునుగా ఉంటుంది. బలగాల నిర్వహణలో అది చైనాకు కలిసొచ్చే అంశమే. ఇక శీతాకాలంలో తూర్పు లద్దాఖ్‌లో చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, సామగ్రి విషయంలో భారత్ తో పోలిస్తే చైనాదే పైచేయి. చలి తీవ్రత బాగా పెరిగే వరకు బలగాలను డ్రాగన్ వెనక్కి తీసుకోకపోతే భారత్ కూడా అధిక సంఖ్యలో సైనికులు, ఆయుధ సామగ్రిని అక్కడ కొనసాగించాల్సి వస్తుంది. ఆలా చేస్తే ఖర్చు చాలా అవుతుంది. ఇప్పటికే కరోనా దెబ్బకి భారత్ ఆర్థిక వ్యవస్థ కష్టాల్లో ఉంది. దీనికోసమే చైనా కావాలనే ఇలా ప్రవర్తిస్తుంది అని భావిస్తున్నారు.