Begin typing your search above and press return to search.

న్యూజిలాండ్ పై భారత్ ఘనవిజయం.. సిరీస్ సొంతం

By:  Tupaki Desk   |   21 Jan 2023 1:31 PM GMT
న్యూజిలాండ్ పై భారత్ ఘనవిజయం.. సిరీస్ సొంతం
X
రాయ్ పూర్ లోని క్రికెట్ స్టేడియంలో శనివారం జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్‌ను కేవలం 108 పరుగులకే కట్టడి చేసిన టీమిండియా అనంతరం 2 వికెట్లు కోల్పోయి ఈజీగా లక్ష్యాన్ని ఛేదించింది. భారత బౌలర్లు తమ పదునైన బౌలింగ్‌ తో కచ్చితత్వంతో, మంచి స్వింగ్, టర్న్, బౌన్స్, పదునైన రిటర్న్ క్యాచ్‌లు పట్టి న్యూజిలాండ్ ను 108కే కుప్పకూల్చారు. పచ్చికతో కూడిన పిచ్‌పై, మహ్మద్ సిరాజ్ , మహ్మద్ షమీ న్యూజిలాండ్ టాప్ , మిడిల్ ఆర్డర్ ను కుప్పలకూల్చారు. ఒక దశలో న్యూజిలాండ్ 15కే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్ , మిచెల్ సాంట్‌నర్ చివరలో పోరాడినా సాధ్యం కాలేదు. తమ జట్టును ఇబ్బందుల నుండి బయటపడేయలేకపోయారు. బౌలింగ్ ఆరంభాన్ని హార్దిక్ పాండ్యా, శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్ , కుల్దీప్ యాదవ్ కొనసాగించారు.

బౌలర్లు బాగా రాణించడంతో రోహిత్ శర్మ మొదట బౌలింగ్ చేయాలనే నిర్ణయం సరైందేనని అర్థమైంది. షమీ మరియు సిరాజ్ తదుపరి ఐదు ఓవర్లకు న్యూజిలాండ్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు.

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన కివీస్ ను భారత్ భౌలర్లు బెంబేలెత్తించారు. కేవలం 34.3 ఓవర్లలో 108 పరుగులకే కుప్పకూల్చారు. ఆ జట్టులో ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోరు సాధించగా.. గ్లెన్ ఫిలిప్స్ (36) టాప్ స్కోరర్.

బ్రాస్ వెల్ 22, సాంటర్న్ 27 పరుగులతో రాణించారు. మిగతా వారు విఫలమవడంతో 15 పరుగులకే మొదట 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. చివరకు 108 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

న్యూజిలాండ్ నిర్ధేశించిన 109 పరుగుల లక్ష్యాన్ని భారత్ 20.1 ఓవర్లలో ఛేదించింది. ఓపెనర్ రోహిత్ శర్మ (51), అర్థశతకంతోపాటు శుభ్ మన్ గిల్ 40 పరుగులతో రాణించడంతో టీమిండియా ఈజీగా 20.1 ఓవర్లలోనే ఛేదించేసింది. ఈ గెలుపుతో 3 వన్డేల సిరీస్ లో టీమిండియా 2-0తో కైవసం చేసుకుంది. మూడో వన్డే నామమాత్రంగా మారింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.