Begin typing your search above and press return to search.

ప్రపంచకప్: భారత్ ముందున్న సవాల్ ఇదే!

By:  Tupaki Desk   |   9 July 2019 4:38 AM GMT
ప్రపంచకప్: భారత్ ముందున్న సవాల్ ఇదే!
X
వన్డే ప్రపంచకప్ క్రికెట్ నాకౌట్ దశకు చేరింది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు మాంచెస్టర్ వేదికగా సెమీస్ లో ఇండియా - న్యూజిలాండ్ తలపడబోతున్నాయి. లీగ్ దశలో ఓడినా తరువాతి మ్యాచ్ లో గెలిచి వెళ్లొచ్చు. కానీ సెమీస్ లో ఓడితే ఇంటికే. లీగ్ దశలో అద్భుత వరుస విజయాలతో టాప్ లో నిలిచిన భారత్ కు ఇప్పుడు న్యూజిలాండ్ రూపంలో ప్రత్యర్థి కాచుకొని ఉంది.

ప్రపంచకప్ ను ఇంతవరకు అందుకోని దేశాలుగా ఇంగ్లండ్ - న్యూజిలాండ్ - సౌతాఫ్రికాలున్నాయి. అయితే ఇందులో సౌతాఫ్రికా ఇంటి దారి పట్టగా.. సొంతగడ్డపై ఇంగ్లండ్ ఉవ్విళ్లూరుతోంది. న్యూజిలాండ్ ఎప్పుడూ సెమీస్ వరకు వచ్చి - ఫైనల్ వరకు వచ్చి ప్రపంచకప్ లో ఓడిపోవడం జరుగుతోంది. ఆ టీం నాకౌట్ దశలో ఓడి ప్రపంచకప్ కళను తీర్చుకోవడం లేదు. 2015 ప్రపంచకప్ లో కూడా ఇలానే ఆస్ట్రేలియా చేతిలో ఓడి కప్ కు దూరమైంది. ప్రపంచకప్ లలో ఏడు సార్లు సెమీస్ చేరిన న్యూజిలాండ్.. కేవలం ఒక్కసారి మాత్రమే ఫైనల్ చేరడం విశేషం. ఏ ఒక్కసారి కూడా ప్రపంచకప్ అందుకోలేదు.

అయితే ఈసారి మాత్రం న్యూజిలాండ్ పట్టుదలగా ఆడింది. వరుసగా మొదట్లో విజయాలు సాధించి టేబుట్ టాప్ గా నిలిచింది. ప్రపంచకప్ కు ముందు టీమిండియాను ప్రాక్టీస్ మ్యాచ్ లో ఓడించడం ఇప్పుడా జట్టుకు బలంగా మారింది. అయితే ప్రపంచకప్ లో భారత్ ఆడిన తీరు చూస్తే మాత్రం టీమిండియా ముందు న్యూజిలాండ్ దిగదుడుపేనన్న అంచనాలు ఏర్పడుతున్నాయి.

ఈ ప్రపంచకప్ సెమీస్ లో ఏ రకంగా చూసినా భారత్... ప్రత్యర్థి న్యూజిలాండ్ కంటే బలంగా ఉంది. అన్ని రంగాల్లో ఆదిపత్యం చెలాయించేలా ఉంది. అయితే మాంచెస్టర్ లో టాస్ కీలకం. ఏ జట్టు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టే గెలుస్తుంది. పిచ్ స్వభావం అలా ఉంది. ప్రపంచకప్ లో ఆరు సార్లు సెమీస్ చేరిన భారత్ 3-3 మ్యాచ్ లో విజయం సాధించింది. రెండు సార్లు ప్రపంచకప్ గెలిచింది.

రోహిత్ - రాహుల్ - కోహ్లీ ఆడితేనే భారత్ గెలుస్తుంది. ఇంతవరకు మిడిల్ ఆర్డర్ ఆడింది లేదు. అందుకే మొదటి ముగ్గురు ఆడడం.. టాస్ గెలవడమే భారత్ గెలుపునకు దోహదం పడుతుంది. ఈ మాత్రం తేడా వచ్చినా ఇంగ్లండ్ పిచ్ లపై చేజింగ్ తో గెలవడం కష్టం. ఈ నేపథ్యంలోనే ఈ సెమీస్ లో ఏ జరుగుతుందన్న ఆసక్తి నెలకొంది. ఈ మధ్యాహ్నం 3 గంటల నుంచి అందరూ టీవీలకు అతుక్కుపోవడం ఖాయంగా కనిపిస్తోంది.