Begin typing your search above and press return to search.
WTC Final:భారత్ ఓటమికి, కివీస్ విజయానికి కారణాలేంటి?
By: Tupaki Desk | 24 Jun 2021 4:30 AM GMTప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలపై అదరగొట్టిన భారత్ కు న్యూజిలాండ్ గండం మాత్రం తప్పలేదు. ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలో ఓడించి.. ఇంగ్లండ్ ను మట్టికరిపించిన భారత్.. ఇదే న్యూజిలాండ్ చేతిలో వారి సొంత దేశంలో 2-0తో టెస్ట్ సిరీస్ లో ఘోరంగా ఓడింది. అదే ఇంగ్లండ్ లో నిర్వహించిన డబ్ల్యూ.టీసీ ఫైనల్ లో పునరావృతమైంది.
కరోనాతో సుధీర్ఘంగా మన ఆటగాళ్లు ఆటకు దూరంగా ఉన్నారు. ఐపీఎల్ తర్వాత వీరంతా క్రికెట్ ఆడింది లేదు. నేరుగా క్వారంటైన్ తో ఇంగ్లండ్ వచ్చారు. కానీ న్యూజిలాండ్ మాత్రం భారత్ కంటే ముందే ఇంగ్లండ్ లో తిష్టవేసింది. ఇంగ్లండ్ తో టెస్ట్ సిరీస్ ఆడింది. అక్కడి పరిస్థితులను బేరీజు వేసుకుంది. అత్యుత్తమ జట్టుతో బరిలోకి దిగింది. భారత్ పై పకడ్బందీ ప్రణాళికతో ఆడింది. చివరకు విజయం సాధించింది.
ప్రపంచ తొలి టెస్ట్ చాంపియన్ గా న్యూజిలాండ్ విజయం సాధించడానికి పూర్తి అర్హురాలు. ఎందుకంటే భారత బ్యాటింగ్ దిగ్గజాలు ఘోరంగా ఈ మ్యాచ్ లో విఫలమయ్యారు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలో చూపించిన పోరాటాన్ని కూడా చూపలేకపోయారు. ఫట్టుమని ఒక్కరు కూడా ఆఫ్ సెంచరీ చేయలేదంటే మన టాప్ 5 బ్యాట్స్ మెన్ ఘనతను అర్థం చేసుకోవచ్చు.
ఇక న్యూజిలాండ్ బౌలర్ల ఘనతను ఎంత చెప్పినా తక్కువ. వారి చురకత్తుల్లాంటి బంతులకు ప్రపంచంలోనే నంబర్ 1 బ్యాట్స్ మెన్ అయిన కోహ్లీ సైతం బోల్తా పడ్డాడంటే వారు ఏ రేంజ్ లో వేశారో అర్థం చేసుకోవచ్చు. మన బౌలర్లు ఇదే పిచ్ పై తేలిపోయారు.
బుధవారం ముగిసిన డబ్ల్యూటీసీ ఫైనల్ లో కివీస్ జట్టు భారత్ ను 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. మనోళ్లు బ్యాటింగ్ చేయడానికి కష్టపడుతున్న పిచ్ పై న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్ నిలబడి చేసి చూపించారు. మొండిగా నిలబడి కనీసం 5 గంటలు ప్రధాన బ్యాట్స్ మెన్ ఉంటే మ్యాచ్ డ్రా అయ్యేది. కానీ దాన్ని కూడా మన బ్యాట్స్ మెన్ చేయలేకపోయారు. రెండు సెషన్లు ఆడి డ్రా చేసుకోలేకపోయింది. పూజారా, కోహ్లీ, రహానే, రోహిత్ కట్టకట్టుకొని విఫలమయ్యారు. పంత్ మెరుపులు మెరిపించలేదు. 170 పరుగులకే సెకండ్ ఇన్నింగ్స్ లో భారత్ కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో న్యూజిలాండ్ కు కేవలం 139 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్ధేశించింది.
న్యూజిలాండ్ ను ఈ స్వల్ప లక్ష్యం మొదట కంగారు పెట్టింది. అశ్విన్ రెండు వికెట్లు తీసి దెబ్బతీశాడు. అయితే కెప్టెన్ విలయమ్స్ సన్ 52 నాటౌట్, రాస్ టేలర్ 47 తమ అనుభవంతో భారత్ ను ఓడించి కివీస్ కు తొలి ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ టైటిల్ ను అందించారు.