Begin typing your search above and press return to search.

ఇండియా వర్సెస్ పాకిస్తాన్: బాబా రాందేవ్ హాట్ కామెంట్స్

By:  Tupaki Desk   |   24 Oct 2021 10:10 AM GMT
ఇండియా వర్సెస్ పాకిస్తాన్: బాబా రాందేవ్ హాట్ కామెంట్స్
X
ప్రపంచకప్ టీ20 సమరంలో శత్రుదేశాలు భారత్, పాకిస్తాన్ మధ్య ఈరోజు మ్యాచ్ నరాలు తెంపే ఉత్కంఠ మధ్య సాగనుంది. దుబాయ్ లో జరిగే ఈ టీ20 మ్యాచ్ ప్రపంచకప్ కే ఒక బ్లాక్ బస్టర్ మ్యాచ్ అని చెప్పొచ్చు. ఉపఖండంలోని శత్రుదేశాల మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు.

భారత కెప్టెన్ కోహ్లీ, పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజమ్ ఇది మరొక మ్యాచ్ లాంటిదే అని అంతకుమించి ఏమీ లేదని స్పష్టం చేశారు.కానీ బయట అభిమానుల మధ్య అలాగే మాజీ ఆటగాళ్ల మధ్య ఉన్న వాతావరణం చూస్తుంటే అలా కనిపించడం లేదు. మాటల మంటలు రేపుతున్నారు.

తాజాగా నాగ్ పూర్ విమానాశ్రయంలో యోగా గురు బాబా రాందేవ్ విలేకరులతో మాట్లాడుతూ నేడు జరుగనున్న భారత్-పాకిస్తాన్ టీ20 ప్రపంచకప్ జాతీయ ప్రయోజనాలకున.. ‘రాజధర్మం’ఖు విరుద్ధమని వ్యాఖ్యానించారు. క్రికెట్ గేమ్ లో టెర్రర్ గేమ్ ఆడలేమని అన్నారు.

సరిహద్దుల్లో ఉద్రిక్తతల మధ్య నేడు జరుగనున్న ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ గురించి అడిగినప్పుడు బాబా రాందేవ్ ఇలా స్పష్టం చేశారు.

20వ శతాబ్ధం మధ్యలో బ్రిటీష్ వలస పాలన నుంచి స్వాతంత్ర్యం పొందినప్పటి నుంచి పొరుగువారు మనతో మూడు సార్లు యుద్ధానికి దిగారని..కశ్మీర్ విషయంలో ఇప్పటికీ వివాదాలు నెలకొల్పుతూనే ఉన్నారని రాందేవ్ బాబా అన్నారు.

భారత్ చివరి సారిగా పాకిస్తాన్ కు 2013లో ద్వైపాక్షిక సిరీస్ ఆడింది. కానీ ఆ తర్వాత రెండు దేశాల మధ్య ఉగ్రవాదం, దాడులతో సంబంధాలు తెగిపోయాయి. ప్రపంచకప్ టోర్నీల్లో మాత్రమే భారత్, పాకిస్తాన్ లు తలపడుతున్నాయి. 2019లో చివరిసారిగా ఇంగ్లండ్ లో వన్డే ప్రపంచకప్ లో తలపడ్డాయి. ప్రపంచకప్ లలో పాకిస్తాన్ పై భారత్ 12-0 రికార్డును కలిగి ఉంది. 2007లో పాకిస్తాన్ ను ఓడించి భారత్ తొలి టీ20 టైటిల్ ను గెలుచుకుంది.