Begin typing your search above and press return to search.
వారు గీత దాటితే... మేము రేఖ దాటుతాం!
By: Tupaki Desk | 11 Oct 2016 4:28 AM GMTసర్జికల్ స్ట్రైక్స్ ముందు వరకూ ఒక లెక్క, ఇకపై ఒక లెక్క అని చెబుతుంది భారత్. ఉరీ ఉగ్రదాడి అనంతరం భారత్ సర్జికల్ దాడులు జరపడంతో నాటీ నుంచి ఇండియా - పాక్ సరిహద్దుల వద్ద తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి. సర్జికల్ స్ట్రైక్స్ అనంతరం ప్రతీకారేచ్చతో పాక్ రగిలిపోతుంటే - పిచ్చి పిచ్చి పనులు చేస్తే భారత్ చూస్తూ ఊరుకోదని ఇటువైపు నుంచి నిత్యం హెచ్చరికలు వెళ్తూనే ఉన్నాయి. అయితే మారుతున్న భారత్ వైఖరి - పెరుగుతున్న దూకుడు పై తాజాగా ప్రభుత్వ వర్గాలు ఇలా పేర్కొంటున్నాయంటూ కథనాలు వస్తున్నాయి.
పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదంపై భారత్ వైఖరి క్రమంగా మారుతోందని, ఆ విషయంలో ఇక అంతా దూకుడే అని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఒకప్పుడు ఉగ్రదాడులు భారత్ పై దాడి జరిపితే వాటిని... తీవ్రంగా ఖండించడం.. దాడుల కారకులకు శిక్ష పడేలా చూడాలని పాక్ ను అభ్యర్థించడం.. అది తమ పని కాదని పాక్ బొంకడం.. అది పాక్ నుంచి వచ్చిన ఉగ్రవాదుల పనే అని భారత్ సాక్ష్యాలు అందించటం.. ఇది గతంలో ఉగ్రదాడులపై భారత్ వైఖరి! అయితే ఇప్పుడు ఆ పరిస్థితిలో మార్పు కనిపిస్తోందనీ.. భారత్ విధానాలు మారుతున్నాయని.. ఉగ్రవాదులు నియంత్రణ రేఖ దాటి వస్తే, భారత్ హద్దు దాటుతుందని.. భారతే అలాంటి నిర్ణయాలు తీసుకుంటే ఆ అవుట్ పుట్ తట్టుకోవడం పాక్ కు కష్టమని.. పీఓకేలోకి వెళ్లయినా దాడులు చేసేందుకు భారత్ సిద్ధమవుతోందని కొందరు అధికారులు చెబుతున్నారట.
పాక్ ఉగ్రవాదులను హద్దు దాటించి భారత్ లోకి పంపిస్తూ ఉంటే తామూ చూస్తూ ఊరుకోమని, తాము కూడా ఆ రేఖ దాటతామని, అదే జరిగితే ఏమవుతుందనేది సర్జికల్ దాడుల ద్వారా భారత్ గట్టి హెచ్చరికలే పంపింది. ఈ సమయంలో నియంత్రణ రేఖ దాటి పాక్ ఆక్రమిత కశ్మీర్ లోకి అడుగుపెట్టైనా ఉగ్రవాదుల తాటతీయడానికి సిద్ధమని ఇప్పటికే సర్జికల్ స్ట్రైక్ భారత్ నిరూపించింది. అయితే భారత్ అనుసరిస్తున్న ఈ దూకుడు వైఖరి - కుక్క కాటుకు చెప్పుదెబ్బ పద్దతి సరైందేనని, మనిషికో మాట పాక్ కో దెబ్బ అని భారత్ తాజా నిర్ణయాలను పలువురు అభినందిస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/