Begin typing your search above and press return to search.
2020 కల్లా దేశంలో హిందువులే ఉంటారు
By: Tupaki Desk | 18 July 2015 5:30 PM GMTరాబోయే ఐదేళ్లలో భారతదేశం హిందూ దేశంగా మారిపోతుందని విశ్వహిందు పరిషత్ (వీహెచ్‌పీ) అగ్రనేత అశోక్ సింఘాల్ ధీమా వ్యక్తం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా 2030 కల్లా మొత్తం హిందువులే ఉంటారని సింఘాల్ చెప్పారు.
ఆర్ఎస్ఎస్ మాజీ అధినేత, దివంగత కేఎస్ సుదర్శన్ జీవిత చరిత్ర- ఆయన ఆలోచన విధానాన్ని గురించిన పుస్తకాన్ని న్యూఢిల్లీలో ఆవిష్కరించిన సందర్భంగా అశోక్ సింఘాల్ ప్రసంగించారు. సుదర్శన్ దేశంలో "స్వదేశీ" విధానానికి బీజం వేశారని కొనియాడారు."2020 కల్లా భారతదేశంలో, 2030 కల్లా ప్రపంచంలో హిందువులు ఉంటారు. నేను సాయిబాబా ఆశ్రమంలో ఉండగా ఆయన నాతో చెప్పారు. 2014 ఎన్నికల్లో బీజేపీ గెలుపొందడం ఈ క్రమంలో పడిన మొదటి అడుగు.బీజేపీ గెలుపు 800 ఏళ్ల బానిసత్వానికి ముగింపు"అని అన్నారు.
ఈ కార్యక్రమానికి హాజరైన భారత విదేశాంగ శాఖా మంత్రి సుష్మాస్వరాజ్ మాట్లాడుతూ...దేశంలో సౌబృతృత్వ వాతావరణాన్ని కలిగించడంలో సుదర్శన్ క్రియాశీలంగా కృషిచేశారని అన్నారు. ఆయన కల్పించిన స్వేచ్ఛ వల్ల కార్యకర్తల స్థాయి వ్యక్తులు కూడా వివిధ అంశాలపై తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పే అవకాశం దొరికిందని ప్రస్తావించారు.
మొత్తంగా సాయిబాబాను ప్రస్తావిస్తూ మరి..దేశంలోని హిందూ జనాభా గురించి ఆర్ఎస్ఎస్ అగ్రనేత వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది.