Begin typing your search above and press return to search.

ఐక్యరాజ్యసమితో భారత్ భారీ విజయం

By:  Tupaki Desk   |   13 Oct 2018 12:08 PM GMT
ఐక్యరాజ్యసమితో భారత్ భారీ విజయం
X
భారత్ కు ఐక్యరాజ్యసమితిలో అత్యున్నత గౌరవం లభించింది. ప్రపంచంలో మానవహక్కులను కాపాడే ఐక్యరాజ్యసమితి మానవహక్కుల మండలి (యూఎన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్)కు జరిగిన ఎన్నికల్లో భారత్ అత్యధిక ఓట్లతో భారత్ విజయం సాధించింది. ఆసియా పసిఫిక్ కేటగిరిలో భారత్ కు ఈ గౌరవం దక్కింది. మూడేళ్ల పాటు భారత్ ఇందులో సభ్యత్వం కలిగి ఉంటుంది.

ఐక్యరాజ్యసమితిలో మొత్తం 193 సభ్య దేశాలుంటే అందులో భారత్ కు మానవహక్కుల కౌన్సిల్ లో సభ్యత్వం కోసం ఏకంగా 188 ఓట్లు పడడం విశేషం. 2019 జనవరి 1 వ తేదీ నుంచి ఈ సభ్యత్వం యూఎన్ లో అమల్లోకి వస్తుంది.

ఆసియా పసిఫిక్ ప్రాంతం నుంచి మొత్తం 18 దేశాలు కొత్త యూఎన్ కౌన్సిల్ కు ఎన్నికయ్యారు. ఇందులో కనీసం 97 ఓట్లు రావాలి. ఇలా మన దేశంతోపాటు బహ్రెయిన్ - బంగ్లాదేశ్ - ఫిజి - ఫిలిప్పీన్స్ దేశాలు కూడా ఎన్నికయ్యాయి. భారత్ ను ఎన్నుకున్నందుకు యూఎన్ అంబాసిడర్ సయ్యద్ అక్బరుద్దీన్ ప్రపంచ దేశాలకు ట్విట్టర్ లో కృతజ్ఞతలు తెలిపారు. భారత్ విజయం అంతర్జాతీయంగా మన దేశ ప్రయాణాన్ని సూచిస్తోందని ఆయన తెలిపారు.