Begin typing your search above and press return to search.
మోహరిస్తున్న భారత్.. చైనా సరిహద్దుల్లో టెన్షన్
By: Tupaki Desk | 4 Sep 2020 4:00 PM GMTభారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తూర్పు లఢక్ లోని దక్షిణ ప్యాంగాంగ్ ప్రాంతంలో చైనా ట్యాంకులు, పదాతిదళాలను మోహరించింది. ఈ క్రమంలోనే భారత్ కూడా అప్రమత్తమైంది. సరిహద్దుల్లో భారత్ కూడా యుద్ధట్యాంకులను, దళాలను మోహరిస్తోంది.
ఆగస్టు 30న చైనాలో ఈ ప్రాంతంలోకి చొచ్చుకొచ్చింది. చైనా దళాలను భారత సైన్యం ధీటుగా తిప్పికొట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఎల్ఏసీకి 20 కిలోమీటర్ల దూరంలో డ్రాగన్ సైన్యం అత్యాధునిక గన్స్, యుద్ధ పరికరాలతో సన్నద్ధమైంది. కుంగ్ నుంచి ముక్సారీ వరకు చైనా సైన్యం మోహరించింది.
దీంతో భారత సైన్యం అప్రమత్తమైంది. యుద్ధ ట్యాంకులతోపాటు అదనపు దళాలతో ఈ ప్రాంతంలో వివాదాస్పద ఎల్.ఏ.సీ ప్రాంతం వెంబడి మోహరించింది. చైనా సాయుధ దళాలను ట్యాంకు విధ్వంస క్షిపణులు, రాకెట్లు, ఇతర ఆయుధాలతో తిప్పికొట్టేలా భారత్ ఈ ప్రాంతంలో సర్వసన్నద్ధమవుతోంది.
ఇరుపక్షాల వైమానిక దళాలు కూడా ఎల్ఏసీపై పహారా కాస్తున్నాయి. ఉద్రిక్తత ఉందని భారత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణే శుక్రవారం తెలిపారు. మన భద్రత కోసం భారీగా బలగాలను సిద్ధం చేశామన్నారు.