Begin typing your search above and press return to search.

కరోనా అప్డేట్ : దేశంలో 36 లక్షలు దాటిన పాజిటివ్ కేసులు

By:  Tupaki Desk   |   31 Aug 2020 10:30 AM IST
కరోనా అప్డేట్ : దేశంలో 36 లక్షలు దాటిన పాజిటివ్  కేసులు
X
భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి అంతకంతకూ విస్తరిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 78,512 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. దీనితో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 36,21,246 చేరింది. ఆదివారం ఒక్కరోజే కరోనా వైరస్‌ బాధితుల్లో 971 మంది ప్రాణాలు విడిచారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 64,469 కు చేరింది. గత 24 గంటల్లో 60,868 మంది కరోనా‌ రోగులు కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. ఇప్పటివరకు మొత్తం 27,74,802 మంది కోవిడ్‌ రోగులు కోలుకున్నారు. భారత్‌ లో ప్రస్తుతం 7,81,975 యాక్టివ్‌ కేసులున్నాయి. ఈమేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం హెల్త్‌ బులెటిన్‌ లో వెల్లడించింది. దేశంలో కరోనా రోగుల రికవరీ రేటు 76.61 శాతంగా ఉందని తెలిపింది. అలాగే నమోదైన మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 21.60 శాతంగా ఉన్నాయని వెల్లడించింది. మరణాల రేటు 1.79 శాతానికి తగ్గిందని వెల్లడించింది.

కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 4,23,07,914 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 8,46,278 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది. ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులున్న దేశాల్లో... అమెరికా, బ్రెజిల్ తర్వాత భారత్ మూడో స్థానంలో ఉంది. అలాగే... కొత్త కేసుల నమోదులో... ఇండియా 26 రోజులుగా టాప్ పొజిషన్‌ లో కొనసాగుతోంది. మొత్తం మరణాల్లో... అమెరికా, బ్రెజిల్ తర్వాత ఇండియా మూడో స్థానంలో ఉంది. రోజువారీ మరణాల్లో భారత్ మొదటి స్థానంలో ఉంది.

ఇక , తెలంగాణలో గత 24 గంటల్లో కొత్తగా 1873 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య లక్షా 24వేల 963కి చేరింది. అలాగే నిన్న 9 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 827కి చేరింది. తెలంగాణలో మరణాల రేటు 0.66 శాతంగా ఉండగా... దేశంలో అది 1.78 శాతం ఉంది. తెలంగాణలో నిన్న 1849 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీ కేసుల సంఖ్య 92వేల 837కి పెరిగింది. ప్రస్తుతం తెలంగాణలో 31299 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వాటిలో 24216 మంది ఇళ్లలోనే ఉంటూ ట్రీట్‌మెంట్ పొందుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం నిన్న 37791 శాంపిల్ టెస్టులు జరిపింది. మొత్తం టెస్టుల సంఖ్య 13లక్షల 65వేల 582కి చేరింది.