Begin typing your search above and press return to search.
దేశంలో 45 లక్షలు దాటిన కరోనా కేసులు .. కొత్తగా ఎన్నంటే ?
By: Tupaki Desk | 11 Sept 2020 12:30 PM ISTభారదేశంలో కరోనా మహమ్మారి కేసులు, మృతుల సంఖ్య అంతకంతకు పెరిగిపోతోంది. ప్రతిరోజు కూడా రికార్డు స్థాయిలో కేసులు నమోదు అవుతున్నాయి. మొత్తం కేసుల సంఖ్య 45 లక్షల మార్కును దాటింది. గత 24 గంటల్లో దేశంలో 96,551 మందికి కరోనా సోకిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. తాజా కేసులతో కలిపి దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 45,62,415కు చేరింది. ఇప్పటి వరకూ ఒకే రోజులో అత్యధిక కేసుల సంఖ్య ఇదే కావడం గమనార్హం. అలాగే గడిచిన 24 గంటల్లో మరో 1209 మంది మరణించగా.. మొత్తం మరణాల సంఖ్య 76,271 కు చేరింది. దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 35,42,664 కు చేరుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 9,43,480 గా ఉంది.
దేశంలో మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 20.68 శాతం ఉన్నాయి. అలాగే, కరోనా రికవరీ రేటు 77.65 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాల రేటు 1.67 శాతానికి పడిపోయిందని తెలిపింది. గడచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 11,63,542 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా ఇప్పటివరకు 5,40,97,975 కరోనా నిర్దారణ పరీక్షలు చేసినట్లు కేంద్రం తెలిపింది. కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 5,40,97,975 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 11,63,542 శాంపిళ్లను పరీక్షించినట్లు తెలిపింది.
తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 2,426 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,52,602కు చేరింది. అలాగే, నిన్న 13 మంది కరోనా కారణంగా మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య 940కి పెరిగింది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా కరోనా కోరల నుంచి బయటపడిన వారి సంఖ్య 1,19,467కు చేరుకుంది. రాష్ట్రంలో ఇంకా 32,195 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. వీరిలో 25,240 మంది ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు. గత 24 గంటల్లో 62,890 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 20,16,461 మందికి పరీక్షలు చేశారు.