Begin typing your search above and press return to search.

పూనియాలో ధైర్యం నింపిన తండ్రి.. కోహ్లీయే స్ఫూర్తి..!

By:  Tupaki Desk   |   23 May 2021 12:30 AM GMT
పూనియాలో ధైర్యం నింపిన తండ్రి.. కోహ్లీయే స్ఫూర్తి..!
X
ఓ వైపు కన్న తల్లి కరోనాతో మృతిచెందిన పుట్టెడు దదుఃఖంలో ఉంది మహిళా క్రికెటర్​ ప్రియా పూనియా.. అదే టైంలో ఆమెకు ఇంగ్లండ్​ టూర్ కు అవకాశం దక్కింది. ఇంగ్లండ్​ టూర్​ కు వెళ్లడం .. తన చిరకాల కాంక్ష. కానీ ఓ వైపు తల్లి మృతి చెందడంతో ఆమె డిప్రెషన్​ లో ఉంది. సరిగ్గా ఆ టైంలో పూనియాకు తన తండ్రి అండగా నిలిచాడు. ఇంగ్లండ్​ టూర్​ కు వెళ్లాలంటూ ధైర్యం చెప్పాడు.

అందుకు కోహ్లీని ఉదాహరణగా చూపించాడు.. పూనియా తండ్రి సురేంద్ర పూనియా.. కోహ్లీ కూడా గతంలో ఓ సారి ఢిల్లీ తరఫున రంజీ ట్రోపీ ఆడవలిసి ఉంది. సరిగ్గా ఆ టైంలోనే తండ్రి మరణించాడు. దీంతో కోహ్లీ ఎంతో బాఢపడ్డాడు. అయినప్పటికీ ఆ బాధను దిగమింగుకొని.. మ్యాచ్​ ఆడాడు. ప్రస్తుతం ప్రియా పూనియాకు ఆమె తండ్రి కోహ్లీ గురించే చెప్పాడు. కోహ్లీ గతంలో తండ్రి చనిపోయినా రంజీ మ్యాచ్​ ఆడాడని ఆమెలో స్ఫూర్తి నింపాడు తండ్రి.

మహిళా క్రికెటర్​ పూనియా తల్లి సరోజ కొంతకాలం క్రితం కరోనాతో కన్నుమూశారు. దీంతో పూనియా కుటుంబం దుఃఖంలో మునిగిపోయింది. సరిగ్గా ఇదే టైంలో పూనియాకు ఇంగ్లాండ్​ వెళ్లేందుకు అవకాశం రావడం గమనార్హం. దీంతో ఆమె ఎటుపోలేని స్థితిలో ఉండిపోయింది. ఓ దశలో ఇంగ్లండ్​ టూర్​ కు వెళ్లకూడదని నిర్ణయించుకున్నది. తీవ్ర డిప్రెషన్​ లో మునిగిపోయింది. ఆమె పరిస్థితిని గమనించిన తండ్రి సురేంద్ర పూనియా కూతురుకు ధైర్యం చెప్పాడు. ఇటువంటి సమయాల్లోనే ధైర్యంగా ఉండాలని ఆమెకు నూరిపోశాడు.

గత ఏడాది టీమిండియా జట్టు ఆస్ట్రేలియా టూర్​ లో ఉన్నప్పుడు హైదరాబాద్​ క్రికెటర్​ మహ్మద్​ సిరాజ్​ తండ్రి మృతిచెందిన విషయం తెలిసిందే. అయినప్పటికీ అతడు అలాగే సీరిస్​ లో ఆడాడు. తాజాగా ప్రియాకు కూడా అటువంటి పరిస్థితే ఎదురైంది. చివరకు తండ్రి ధైర్యం చెప్పడంతో ఆమె ఇంగ్లండ్​ టూర్​ కు వెళ్లేందుకు సిద్ధపడింది. కోహ్లీసేన, మిథాలి నేతృత్వంలోని మహిళల జట్టు ఇంగ్లండ్‌ టూర్‌ కు వెళ్లనున్న విషయం తెలిసిందే. ఈ నెల 19నుంచి రెండు వారాలపాటు వీరంతా ముంబైలో క్వారంటైన్‌ లో ఉంటున్నాయి. ఆ తర్వాత ఒకే ఫ్లైట్ లో ముంబై వెళ్లనున్నారు.