Begin typing your search above and press return to search.
25 రోజులు వయసు లో కరోనా జయించిన బుడతడు!
By: Tupaki Desk | 30 April 2020 9:10 AM GMTకరోనా మహమ్మారి వయస్సుతో సంబంధం లేకూండా ప్రతి ఒక్కరికి వ్యాపిస్తుంది. అప్పుడే పుట్టిన పసికందుల నుండి 100 ఏళ్లు దాటిన వారిని కూడా ఈ మహమ్మారి వదిలిపెట్టలేదు. ఇకపోతే తాజాగా హైదరాబాద్ లోని గాంధీ హాస్పిటల్ నుండి 25 రోజుల పసికందు కరోనాను జయించి అమ్మ వద్దకి చేరాడు. వెచ్చగా అమ్మ పొత్తిళ్లలో సేద తీరాల్సిన 25 రోజుల పసికందు 19 రోజుల క్రితం కరోనాతో గాంధీ ఆసుపత్రిలో చేరాడు. వైద్యుల తోడుగా వైరస్‌తో యుద్ధం చేశాడు. తన బిడ్డకు ఏమవుతుందోననే ఆందోళనలో ఉన్న ఆ తల్లి ఆశలు వమ్ముకాలేదు. సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా బుడతడు ఒడి చేరడంతో ఆ అమ్మ సంతోషానికి అవధులు లేవు.
దేశంలో కరోనా సోకిన అత్యంత పిన్న వయసున్న బాబుకు సమర్థంగా చికిత్స అందించారంటూ గాంధీ ఆసుపత్రి వైద్యులను మంత్రి ఈటల రాజేందర్ ప్రత్యేకంగా అభినందించారు. దిల్లీ నుంచి వచ్చిన మహబూబ్ నగర్ వాసికి కరోనా పాజిటివ్ అని తేలడంతో ఏప్రిల్10న అతడి బిడ్డ నుంచి సైతం శాంపిళ్లు సేకరించారు. అప్పటికే ఆ పసికందు విరేచనాలు, జ్వరంతో బాధపడుతున్నాడు. చివరికి వైరస్ ఉన్నట్లు నిర్ధారణ కావడంతో 25 రోజుల బిడ్డను గాంధీ ఆసుపత్రికి తీసుకొచ్చారు. చికిత్సకు ఎలా ముందుకెళ్లాలో చర్చించి వైౖద్యులంతా అప్రమత్తమయ్యారు.
చిన్న పిల్లల డాక్టర్లు నిరంతరం పర్యవేక్షించారు. ఔషధాలు అందించారు. జ్వరం, విరేచనాలు తగ్గి క్రమంగా ఆరోగ్యం మెరుగుపడింది. ఏ దశలోనూ వెంటిలేటర్ అవసరం రాలేదని గాంధీ సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు తెలిపారు. ఇటీవల 75, 78 ఏళ్ల వయసున్న ఇద్దరు వృద్ధులు కూడా గాంధీ ఆసుపత్రిలో కోలుకున్న సంగతి తెలిసిందే.ఇకపోతే గాంధీ ఆసుపత్రి నుంచి బుధవారం మరో 12 మంది పిల్లలు కరోనా నుంచి కోలుకొని డిశ్ఛార్జి అయ్యారు. వీరిలో హైదరాబాద్‌తో పాటు వివిధ జిల్లాలకు చెందినవారున్నారు.