Begin typing your search above and press return to search.
విద్వేష పైత్యం న్యూజిలాండ్ కూ పాకింది
By: Tupaki Desk | 7 March 2017 5:04 AM GMTద్వేషించటం ఒక మత్తుమందు లాంటిది. ఒక్కసారి అది మొదలైందా? దాన్ని కంట్రోల్ చేయటం చాలా కష్టం. తెంపరి ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అమెరికాలో పెరిగిన జాతివివక్ష ఏస్థాయిలో ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. తమ దేశానికి వచ్చిన విదేశీయుల కారణంగా తాము ఉపాధి అవకాశాల్ని కోల్పోతున్న ఫీలింగ్ పెరిగిపోతున్నఅమెరికన్లు.. ఈ మధ్య కాలంలో భారతీయులపై దాడి చేయటం మొదలైంది. ఇప్పటికే ఇలాంటి పరిణామాలు తీవ్ర విషాదానికి దారి తీశాయి.
అమెరికాలోని జాతివివక్షతో కిందామీదా పడుతున్న భారతీయులకు తాజాగా ఈ విద్వేషం న్యూజిలాండ్ కు కూడా పాకడటం ఆందోళనను కలిగిస్తోంది. అక్లాండ్ లో ఒక సిక్కు జాతీయుడిపై స్థానికులు చేసిన జాత్యాంహకార వ్యాఖ్యలు కాస్త ఆలస్యంగా బయటకు వచ్చాయి. ఇలాంటివి ఈ మధ్య కాలంలో న్యూజిలాండ్ లో ఎక్కువైనట్లుగా చెబుతున్నారు.
అక్లాండ్ లో నివసించే నరీందర్వీర్ సింగ్ పార్కింగ్ లో నుంచి తన కారు తీస్తుండగా.. ఒక జంట అక్కడకు వచ్చింది. వారు వెళ్లేందుకు దారి ఇచ్చినా.. ఆ జంట మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరు మీ దేశానికి వెళ్లిపోండి అంటూ తీవ్ర పదజాలంతో హెచ్చరించినట్లుగా నరీందర్వీర్ చెబుతున్నారు. కారులో ఉన్న మహిళ సైతం.. అసభ్యకరంగా దూషిస్తూ వేలు చూపించిందని వాపోయాడు.
వారి వైనాన్ని వీడియో తీసిన సింగ్ ను.. ఆ జంట రోడ్డు పక్కన కారు ఆపి మరీ వచ్చి.. బెదిరించి తిట్టేశారని చెప్పుకొచ్చారు. పంజాబీల గురించి దారుణంగా మాట్లాడినట్లుగా పేర్కొన్నారు. ఇలాంటి ఉదంతమే మరొకటి న్యూజిలాండ్ లో చోటు చేసుకుంది. ఈ ఉదంతంలో విక్రమ్ జిత్ సింగ్ అనే యువకుడిపైనా స్థానికుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడినట్లుగా తెలుస్తోంది. రోడ్ల మీద కారు ఎంత వేగంగా నడపాలో తెలీదా? అంటూ తిట్ల దండకం అందుకున్నట్లుగా చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఇలాంటి ధోరణులు న్యూజిలాండ్ లో ఎక్కువైనట్లుగా చెబుతున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/