Begin typing your search above and press return to search.
కశ్మీర్ పై జోక్యం చేసుకోండి..అమెరికా విదేశాంగ మంత్రికి లేఖ
By: Tupaki Desk | 12 Sep 2019 8:33 AM GMTగత నెల 5వ తేదీన కేంద్ర ప్రభుత్వం జమ్మూ-కశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసి జమ్మూకశ్మీర్ - లడాఖ్ ను కేంద్రపాంత్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో కశ్మీర్ లో ఎలాంటి ఉద్రిక్త పరిస్తితి చోటు చేసుకోకుండా కేంద్ర ప్రభుత్వం భారీగా బలగాలను మొహరించింది. రాజకీయ నేతలను హౌస్ అరెస్ట్ చేసింది. 144 సెక్షన్ అమలు చేసింది. కశ్మీర్ లోయలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. అయితే ఈ పరిస్థితులు ఇప్పటికీ నెలకొని ఉన్నాయి. దీంతో కశ్మీర్ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
ఈ నేపథ్యంలో ఇండో - అమెరికన్ కాంగ్రెస్ నేతలు కశ్మీర్ పై జోక్యం చేసుకోవాలని అమెరికా విదేశాంగ మంత్రిని కోరారు. హౌస్ ఆఫ్ రిప్రజెంటివ్ లో సభ్యులుగా ఉన్న ప్రమీల జయపాల్ - జేమ్స్ పీ మెక్ గవర్న్ అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్ పొంపేకు లేఖ రాశారు. గృహ నిర్బంధంలో ఉన్న నేతలను వెంటనే విడుదల చేయాలని కోరారు. అలాగే 144 సెక్షన్ వెనక్కి తీసుకుని- జనజీవనం స్తంభించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా కశ్మీర్ లో పరిస్తితి సమీక్షించేందుకు అంతర్జాతీయ మీడియాని - మానవ హక్కుల సంఘాలకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
అలాగే కశ్మీర్ లో వెంటనే ఆసుపత్రులని తెరిపించాలని, లేదంటే ప్రజలు అనారోగ్యంతో ఇబ్బందులు పడే అవకాశం ఉందని చెప్పారు. దయచేసి ఈ విషయాలపై మానవత్వంతో స్పందించి - కశ్మీర్ లోయలో మానవ హక్కులను కాపాడాలని అమెరికా విదేశాంగ మంత్రిని కోరారు. దీని కోసం ఇండియాపై ఒత్తిడి తీసుకురావాలని లేఖలో పేర్కొన్నారు. మరి మంత్రి ఈ సూచనలని పరిగణలోకి తీసుకుని భారత్ పై ఏ మేర ఒత్తిడి తీసుకొస్తారో చూడాలి.