Begin typing your search above and press return to search.
న్యూయార్స్ లో అగ్ని ప్రమాదం: భారతీయ వ్యాపారవేత్త దుర్మరణం
By: Tupaki Desk | 19 Dec 2022 12:38 PM GMTన్యూయార్క్‌లోని లాంగ్ ఐలాండ్‌లోని డిక్స్ హిల్స్ కాటేజ్ హోమ్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో భారతీయ-అమెరికన్ వ్యాపారవేత్త తాన్యా బతిజా (32).. ఆమె పెంచుకునే కుక్క మరణించింది. తాన్యా తండ్రి, వ్యాపారవేత్త, సంఘం నాయకుడు అయిన గోవింద్ బతిజా డిసెంబర్ 14న వ్యాయామం చేయడానికి త్వరగా నిద్రలేచాడు.
అతను కిటికీలోంచి చూసేసరికి, కుటీరం మంటల్లో ఉన్నట్లు గమనించాడు. తన భార్యను హెచ్చరించాడు. వెంటనే 911కి కాల్ చేసాడు. వారు బయట కుటీరం వైపు పరిగెత్తారు. వారి కుమార్తెను అగ్ని నుండి బయటకు తీసుకురావడానికి ప్రయత్నించారు. కానీ కుటీరం పూర్తిగా దగ్ధమైంది.
ఇద్దరు పోలీసు అధికారులు, ఒక స్థానికుడు బతిజాను రక్షించడానికి ప్రయత్నించారు. కానీ మంటలు చాలా శక్తివంతంగా వ్యాపించడంతో సాధ్యం కాలేదు. అగ్నిమాపక యంత్రాలు మంటలను పూర్తిగా ఆర్పేలోపే ఆమె అగ్ని ప్రమాదంలో మరణించింది. విచారణ తర్వాత సఫోల్క్ కౌంటీ పోలీస్ డిపార్ట్‌మెంట్ అగ్ని ప్రమాదకరంగా సంభవించింది కాదని నిర్ధారించింది. దీనిపై విచారణ జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు.
తాన్యా బతిజా డిక్స్ హిల్స్‌లోని హిందూ సమాజంలో సేవా కార్యక్రమాలు చేస్తుంటుంది. ఎంబీఏ పూర్తి చేసిన తర్వాత, ఆమె ప్రముఖ వ్యాపారవేత్తగా మారింది. ఆమె ఇటీవల బెల్‌పోర్ట్‌లో డంకిన్ డోనట్స్ అవుట్‌లెట్‌ను తెరిచింది. మరో అవుట్ లెట్ పాయింట్ కోసం మరో ప్రాజెక్టు చేపట్టింది. కానీ ఈ అగ్ని ప్రమాదంలో మరణించడం విషాదం నింపింది.
ఆదివారం ఉదయం 10 గంటలకు రోంకొంకోమా సరస్సులోని మలోనీ లేక్ ఫ్యూనరల్ హోమ్ అండ్ క్రిమేషన్ సెంటర్‌లో తాన్యా అంత్యక్రియలు జరిగాయి. హిక్స్‌విల్లేలోని అసమై హిందూ దేవాలయంలో సాయంత్రం 4 గంటలకు ప్రార్థనా కార్యక్రమం నిర్వహించి బంధువులు కుటుంబ సభ్యుల శోకసంద్రాల మధ్య ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.