Begin typing your search above and press return to search.

భారతీయ అమెరికన్ అద్భుత సృష్టి ... క్షణాల్లో కరోనా నిర్దారణ .. ఎలా అంటే ?

By:  Tupaki Desk   |   10 April 2020 6:50 AM GMT
భారతీయ అమెరికన్ అద్భుత సృష్టి ... క్షణాల్లో కరోనా నిర్దారణ .. ఎలా అంటే ?
X
కరోనా వైరస్ ...చైనాలో వెలుగులోకి వచ్చిన ఈ మహమ్మారి, ఆ తరువాత ఒక్కొక్క దేశం విస్తరిస్తూ , ప్రపంచంలోని అన్ని దేశాలకి వ్యాప్తి చెందింది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు ప‌దిహేను ల‌క్ష‌ల‌కు పైగా క‌రోనా కేసులు న‌మోదు కాగా సుమారు 89వేల‌మంది మ‌ర‌ణించారు. మూడు ల‌క్ష‌ల‌ మంది పైచిలుకు దానితో పోరాడి విజ‌యం సాధించారు. దీనికి ఎక్కడ అడ్డుకట్ట పడుతుందో, ఎలా అరికట్టాలో తెలియక అన్ని దేశాలూ అతలాకుతలం అవుతున్నాయి. ఇందులో భాగంగా పలు దేశాలు నిషేధాజ్ఞలు విధిస్తున్నాయి. ప్రజలను ఇళ్ల నుంచి రాకుండా ఆంక్షలు జారీచేస్తున్నాయి. అయినా, వైరస్ మరణాలు, బాధితుల సంఖ్య మాత్రం పెరుగుతోంది.

ముఖ్యంగా అమెరికాలో కరోనా భాదితుల సంఖ్య రోజు రోజుకి విపరీతంగా పెరిగిపోతుంది. అమెరికాలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 5లక్షలకు చేరువలో ఉంది. ఇకపోతే ఈ మహమ్మారి వెలుగులోకి వచ్చి నెలలు గడుస్తున్నా కూడా దీనికి ఇంకా సరైన వ్యాక్సిన్ ను కనిపెట్టడంలో ప్రపంచం మొత్తం విఫలం అయ్యింది. కరోనా కి వ్యాక్సిన్ కోసం ప్రతి దేశంలో విస్తృతంగా ప్రయోగాలు చేస్తున్నారు. ఇకపోతే కరోనా విజృంభణకు మరో కారణం ...నిర్దారణ పరీక్ష. ప్రస్తుతం ఒకరికి కరోనా ఉందొ లేదో తేల్చడానికి ..24 గంటల సమయం పడుతుంది. దీనితో నిర్దారణ పరీక్షల్లో చాలా ఆలస్యం అవుతుంది.

ఈ నేపథ్యంలో కరోనా పరీక్షలని అత్యంత వేగంగా నిర్వహించే మార్గాలని పరిశోధకులు అన్వేషిస్తున్నారు. ఈ విషయంలో అమెరికా కి చెందిన ఒక శాస్త్రవేత్త అద్భుతం సాధించినట్టు తెలుస్తుంది. చాతీ భాగంగాలో ఎక్సరే తీయడం ద్వారా క్షణాల్లో కరోనా ఉందొ లేదో తెలుసుకునే విధానాన్ని రూపొందించినట్లు భారతీయ అమెరికన్ భరత్ నారాయనన్ ప్రకటించారు.