Begin typing your search above and press return to search.
అమెరికాలో కాల్పులు.. మనోడు మృతి
By: Tupaki Desk | 13 Nov 2017 3:53 AM GMTఅగ్రరాజ్యం అమెరికాలో హింసాత్మక ఘటనలు ఈ మధ్యన మరింత పెరిగిపోతున్నాయి. భారత సంతతి అమెరికన్ ఒకరు తాజాగా జరిగిన కాల్పుల్లో ప్రాణాలు పోగొట్టుకున్నాడు. అమెరికాలోని ఉత్తర కరోలినా రాష్ట్రంలో దుండగుడు జరిపిన కాల్పుల్లో క్లబ్ యజమాని అయిన భారతీయ అమెరికన్ మృతి చెందారు. గుజరాత్ కు చెందిన ఆకాశ్ తలాటీ అనే 40 ఏళ్ల వ్యక్తి ఫేయట్ విల్ నగరంలోని ఒక క్లబ్ ను నిర్వహిస్తున్నాడు.
అయితే.. మార్కీస్ డేవిట్ అనే యువకుడు అర్థరాత్రి దాటిన వేళ.. క్లబ్ లో అభ్యంతరకరంగా వ్యవహరిస్తున్నాడు. దీంతో అతన్ని క్లబ్‌నుంచి బయటకు పంపేశారు. కాసేపటికే గన్ పట్టుకొచ్చిన డెవిట్ అక్కడున్న సెక్యురిటీ సిబ్బందిపై కాల్పులు జరపటం మొదలెట్టాడు. సిబ్బంది కూడా కాల్పులు జరిపారు.
దురదృష్టవశాత్తు కాల్పుల సమయంలో అక్కడే ఉన్న క్లబ్ యజమాని ఆకాశ్ తో పాటు మరో నలుగురు గాయపడ్డారు. కాల్పులు జరిపిన డెవిట్‌కు నాలుగు బుల్లెట్లు తగిలాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుననారు. ఈ సమయంలోనే ఆకాశ్ తనప్రాణాల్ని పోగొట్టుకున్నాడు. మిగిలిన వారి ఆరోగ్యం ప్రమాదంలో లేదని చెబుతున్నారు.
ఆకాశ్ కుటుంబానికి అన్ని విధాలుగా సాయం చేస్తామని కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ వెల్లడించారు. ఇది ఇలా ఉండగా.. విదేశాల్లో నివసించే మనోళ్లు ఒకట్రెండు రోజుల వ్యవధిలో వేర్వేరు ఘటనల్లో మరణించిన వైనం షాకింగ్ గా మారింది. వేర్పురు రోడ్డు ప్రమాదాల్లో మనోళ్లు మృతి చెందారు.
న్యూయార్క్ లోని లెవిట్ టౌన్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారత సంతతికి చెందిన వైద్య విద్యార్థిని తరంజిత్ పర్మార్ మృతి చెందారు. వాహనం నడుపుతున్న వ్యక్తి ఢీ కొట్టటంతో ప్రమాదంలో ఆమె మరణించారు. మరోవైపు న్యూజిలాండ్ లోని ఆక్లాండ్ నగరంలో భారత సంతతి మహిళ అరిష్మా అర్చనా సింగ్ హత్యకు గురయ్యారు. ఆమెకు మూడేళ్ల పాప ఉంది. తల్లిదండ్రులతో కలిసి ఉన్న అరిష్మాను.. ఆమె ఇంట్లోకి ప్రవేశించిన ఆగంతకులు ఆమెను హత్య చేశారు. ఇక.. యూకేలోని బర్మింగ్ హోంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారత సంతతి మహిళ.. 62 ఏళ్ల కృష్ణదేవి ద్రోచ్ మృతి చెందారు. విషాదకరమైన విషయం ఏమిటంటే ఆమెను మూడు వాహనాలు ఢీ కొట్టి వెళ్లిపోయినట్లు చెబుతున్నారు. రోజు వ్యవధిలో వేర్వేరు దేశాల్లో నివసించే మనోళ్లు అనూహ్యంగా మరణించటం గమనార్హం.