Begin typing your search above and press return to search.

ఆ కండోమ్ కి చిల్లు ప‌డినా నో ఫిక‌ర్‌!

By:  Tupaki Desk   |   16 Dec 2015 10:30 PM GMT
ఆ కండోమ్ కి చిల్లు ప‌డినా నో ఫిక‌ర్‌!
X
ఎయిడ్స్ మొద‌లుకొని సుఖ‌వ్యాధుల వ‌ర‌కూ ద‌రిదాపుల్లోకి చేర‌కుండా ఉండ‌టానికి ముందుజాగ్ర‌త్త చ‌ర్య‌గా కండోమ్ వాడుతుంటారు. అయితే.. అనుకోని విధంగా కండోమ్ చిరిగిపోతే? ప్ర‌మాద తీవ్ర‌త వంద శాతం ఉంటుంది. అందుకే.. కండోమ్ వినియోగించినా కూడా ప్ర‌మాదం పొంచి ఉంటుంద‌న్న హెచ్చ‌రిస్తుంటారు. ఇక‌పై.. అలాంటి ప్ర‌మాదానికి తావు లేన‌ట్లేన‌ని చెప్పొచ్చు. ఎందుకంటే.. ఒక సూప‌ర్ కండోమ్ ఒక‌టి త‌యారైంది. ఈ సూప‌ర్ కండోమ్ ప్ర‌త్యేక‌త ఏమిటంటే.. ఒక‌వేళ అనుకోని విధంగా ఇది చిరిగిపోతే.. ఎలాంటి ప్ర‌మాదం ఏర్ప‌డ‌కుండా ఉండేలా దీన్ని రూపొందించారు.

కండోమ్ వినియోగించే స‌మ‌యంలో అది చిరిగితే.. సుఖ‌వ్యాధులు.. హెచ్ ఐవీ.. ఎయిడ్స్ లాంటి ప్ర‌మాద‌క‌ర ఇన్ఫెక్ష‌న్ల చుట్టుకునే ప్ర‌మాదం పొంచి ఉంటుంది. తాజాగా రూపొందించిన సూప‌ర్ కండోమ్‌ లో హెచ్ ఐవీ నిరోధ‌క యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో ఉంటాయి. దీంతో.. దీన్ని వినియోగించేస‌మ‌యంలో ఏదైనా జ‌రిగినా.. ఎలాంటి ఇబ్బంది ఉండ‌దు.

ఈ కొత్త కండోమ్‌ తో మ‌రో ప్ర‌యోజ‌నం ఏమిటంటే.. అవాంఛిత గ‌ర్భాన్ని.. సుఖ‌వ్యాధుల‌కు చెక్ చెప్పే సామ‌ర్థ్యం దీని సొంతం. టెక్సాస్ ఎ అండ్ ఎం విశ్వవిద్యాల‌యానికి సంబంధించిన బృందం దీన్ని రూపొందించింది. ఆస‌క్తిక‌ర‌మైన మ‌రో అంశం ఏమిటంటే.. ఈ బృందానికి నేతృత్వం వ‌హించిన మ‌హువా చౌద‌రి భార‌త సంత‌తికి చెందిన వారు. ఈ స‌రికొత్త కండోమ్ త‌యారు చేయ‌టానికి బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేష‌న్ ఎంతో కృషి చేసింది. 1981లో బ‌య‌ట‌ప‌డిన ఎయిడ్స్ కు ఇప్ప‌టికి స‌రైన మందులేదు. దీన్ని చెక్ చెప్పే మందు త‌యారు చేసేందుకు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎంతో కృషి జ‌రుగుతోంది. దీని బారిన ప‌డి ఇప్ప‌టివ‌ర‌కూ దాదాపు 3.9కోట్ల మంది మ‌ర‌ణించ‌టం గ‌మ‌నార్హం. అలాంటి ప్ర‌మాద‌క‌ర‌మైన వ్యాధి ద‌రి చేర‌కుండా ఉండే కండోమ్ త‌యారు చేయ‌టం.. ఒక పెద్ద ముంద‌డుగుగా చెప్పొచ్చు.