Begin typing your search above and press return to search.
అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో భారతీయ అమెరికన్ మహిళ!
By: Tupaki Desk | 21 Jan 2023 8:30 AM GMTయునైటెడ్ స్టేట్స్‌లో 2024 అధ్యక్ష ఎన్నికల చుట్టూ రాజకీయ వేడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో 2024లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను బరిలోకి దిగుతున్నట్టు రిపబ్లికన్ పార్టీ నాయకురాలు, భారతీయ అమెరికన్ నిక్కీ హేలీ సంచలన ప్రకటన చేశారు. అమెరికాను ముందుకు తీసుకెళ్లేందుకు తాను 'కొత్త నాయకురాలు' కాగలనని తెలిపారు. ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిక్కీ హేలీ ఈ మేరకు వ్యాఖ్యానించారు. ప్రస్తుత అధ్యక్షుడు జోబైడెన్ మరోసారి ఎన్నిక కాకపోవచ్చని ఆమె అన్నారు.
ప్రస్తుతం అమెరికా తన దేశీయ, విదేశాంగ విధానాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉందని నిక్కీ హేలీ చెప్పారు. ద్రవ్యోల్బణం అంతకంతకూ పెరుగుతోందన్నారు. అలాగే ఆర్థిక వ్యవస్థ కుచించుకుపోతోందని గుర్తు చేశారు. మరోవైపు ఆర్థిక మాంద్య భయాలు వెంటాడుతున్నాయన్నారు. పెద్ద వ్యాపారస్తులు బెయిలౌట్ ను పొందుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో అమెరికా కొత్త దిశలో వెళ్లాల్సిన అవసరం ఉందని నిక్కీ హేలీ వ్యాఖ్యానించారు.
ఈ నేపథ్యంలో తాను అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నానని నిక్కీ హేలీ వెల్లడించారు. సమర్థవంతంగా అమెరికా ముందుకు తీసుకెళ్ల సామర్థ్యం తనకు ఉందన్నారు. తానెప్పుడూ రేసులో ఓడిపోలేదన్నారు. ఇప్పుడు కూడా చెబుతున్నానని.. తాను ఓడిపోనని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు.
కాగా గతంలో నిక్కీ హేలీ సౌత్ కరోలినా గవర్నర్‌గా పనిచేశారు. అలాగే ఐక్యరాజ్యసమితిలో అమెరికా తరఫున 2017 నుంచి 2018 వరకు రాయబారిగా కూడా ఉన్నారు. తాను సౌత్ కరోలినా గవర్నర్ గా ఉన్నప్పుడు ఆ రాష్ట్రంలో సమస్యలన్నింటిని చక్కదిద్దానని నిక్కీ హేలీ చెప్పారు. అలాగే ఐక్యరాజ్యసమితిలో అమెరికా వాణిని బలంగా వినిపించానని గుర్తు చేశారు.
2018లో డెమోక్రటిక్ అభ్యర్థి జోబైడెన్ అమెరికా అధ్యక్షుడిగా గెలుపొందడంతో నిక్కీ హేలీ ఐక్యరాజ్యసమితిలో తన రాయబారి పదవికి రాజీనామా చేశారు. కాగా రిపబ్లికన్ పార్టీ తరఫున మూడోసారి అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేస్తానని మాజీ అద్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిక్కీ హేలీ ముందు తన సొంత పార్టీలోని ట్రంప్ తో అభ్యర్థిత్వం కోసం పోటీ పడాల్సి ఉంటుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.