Begin typing your search above and press return to search.

23మంది హ‌తం: పాక్‌ కు బుద్ధి చెప్పిన భార‌త సైన్యం

By:  Tupaki Desk   |   12 April 2020 4:00 PM GMT
23మంది హ‌తం: పాక్‌ కు బుద్ధి చెప్పిన భార‌త సైన్యం
X
స‌రిహ‌ద్దు ప్రాంతంలో పాకిస్తాన్ సైన్యం ఎల్ల‌ప్పుడు గుంట‌న‌క్క‌లా ఎదుచూస్తుంటుంది. భార‌త్‌ పైకి క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు త‌ర‌చూ పాల్ప‌డుతూ ఉంటుంది. ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ బారిన ప‌డి తీవ్ర అవ‌స్థ‌లు ప‌డుతున్న స‌మ‌యంలోనూ పాకిస్తాన్ వ‌క్ర‌బుద్ధి మాత్రం మార‌లేదు. మ‌రోసారి భార‌త సైన్యంపై క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డింది. దీంతో భార‌త సైనికుల‌కు చిర్రెత్తుకొచ్చి తుపాకీకి ప‌ని చెప్పారు. పాక్ బ‌ల‌గాల దాడుల‌ను తిప్పికొట్టారు. ఈ దాడిలో పాకిస్తాన్‌ కు చెందిన 15 మంది సైనికులు - 8మంది ఉగ్ర‌వాదులు మృతి చెందారు. ఈ ఘ‌ట‌న ఆల‌స్యంగా తెలిసింది. ఏప్రిల్ 10వ తేదీన ఈ ఘ‌ట‌న జ‌రిగింది.

భారత ఆర్మీ పాక్‌ కవ్వింపు చర్యలకు ధీటుగా సమాధానం ఇచ్చింది. ఈ దాడుల్లో 15 పాకిస్తాన్ జవాన్లతో పాటు 8మంది ఉగ్ర‌వాదులు హతమ‌య్యార‌ని నిఘా వర్గాలు వెల్ల‌డించారు. కరోనాతో పాకిస్తాన్ కూడా స‌త‌మ‌త‌మ‌వుతోంది. ఈ స‌మ‌యంలోనూ భార‌త్‌ పైకి ఆ దేశం క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ‌డం తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ కాల్పులకు దిగుతున్నారు. ఏప్రిల్ 10వ తేదీన భారత సైన్యం ఆర్టిలరీ గన్స్‌ తో దాడికి దిగింది. ఈ దాడిలో పాకిస్తాన్ సైనికుల‌కు భారీ ఎదురుదెబ్బ త‌గిలింది. టెర్రర్‌ లాంచింగ్‌ ప్యాడ్స్‌తో పాటుగా.. పాక్ ఆర్మీ లాంచింగ్‌ ప్యాడ్స్‌ కూడా ధ్వంసమైనట్లు ఓ వీడియోను భార‌త సైన్యం విడుద‌ల చేసింది.

ఏప్రిల్ 5వ తేదీన కేరాన్ సెక్టార్‌ లో భారత ఆర్మీ ఐదుగురు ఉగ్రవాదుల్ని మట్టుబెట్టింది. తాజాగా భారత ఆర్మీ జరిపిన దాడిలో 23మంది మృతి చెందారు. అయితే ఈ దాడి నిజమేన‌ని పాకిస్తాన్ అంగీక‌రించింది. కాక‌పోతే కేవలం నలుగురు మాత్రమే మృతి చెందినట్లు ప్ర‌క‌టించింది.