Begin typing your search above and press return to search.
లష్కరే తోయిబాకు షాక్.. ఉగ్రస్థావరంపై దాడి - ఒకరు అరెస్ట్ !
By: Tupaki Desk | 16 May 2020 11:10 AM GMTదేశంలో మహమ్మారి విలయతాండవం చేస్తున్న సమయంలో దేశంలో అలజడి సృష్టించేందుకు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు వ్యూహాలు పన్నుతున్నారు. అయితే , ఉగ్రవాదుల ఆటలని మన జవాన్లు ఊహించని విదంగా ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్నారు. గత ఏప్రిల్ నెలలో దాదాపు ముప్పై మంది ఉగ్రవాదుల్ని మన ఆర్మీ మట్టుబెట్టింది. అంతేకాదు గత వారం హిజ్బుల్ టాప్ కమాండర్ ను కూడా హతమార్చారు. దీంతో రెట్టింపు ఉత్సాహంతో ఉగ్రవాదుల్ని ఏరివేసే కార్యక్రమంలో భారత ఆర్మీ నిమగ్నమై ముందుకు పోతుంది.
తాజాగా.. జమ్మూకశ్మీర్ లోని బడ్గాం జిల్లాలో లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన రహస్య స్థావరాన్ని భద్రతా బలగాలు గుర్తించాయి. శనివారం ఉదయం ఉగ్రస్థావరంపై దాడి చేసి, అందులో ఉన్న ఓ ఉగ్రవాదిని అరెస్ట్ చేశారు. బాధానే ప్రాంతంలోని అరిజల్ ఖాన్సాయిబ్ లో నక్కిఉన్న లష్కర్-ఎ-తోయిబా టాప్ టెర్రరిస్ట్ జహూర్ వాని”ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతడు రహస్యంగా ఉగ్ర స్థావరాన్ని నిర్వహిస్తున్నాడు. భద్రతా బలగాలు దాడి చేసిన సమయంలో.. స్థావరంలో పెద్ద ఎత్తున మారణాయుధాలు - మందు గుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
ఇతడు ఇతర ఉగ్రవాదులకు వాహనాలను ఏర్పాటు చేయడం తో పాటు - వారికి మందు గుండు సామాగ్రిని కూడా సప్లై చేస్తాడని విచారణలో వెల్లడైంది. అలాగే, లోయలో ఇతడితో పాటు మరో నలుగురు ఉగ్రవాదులు కూడా యాక్టివ్ గా ఉన్నారని, వారిని కూడా అరెస్ట్ చేసినట్లు తెలిపారు. కాగా, రెండు రోజుల క్రితమే సైన్యం.. టాప్ 10 ఉగ్రవాదుల లిస్ట్ ప్రిపేర్ చేసింది. అందులో ఉన్న వారిని పట్టుకునేందుకు ఆపరేషన్ కూడా ఇప్పటికే ప్రారంభించింది. ఈ తరుణంలోనే మరో ఐదుగురు ఉగ్రవాదులు పట్టుబడటం తో.. ఉగ్రవాదులకు భారీ షాక్ తగిలినట్టైంది.